రెటినోపతి వస్తే మనిషికి ప్రమాదమేనా..?
ఈ వ్యాధి అనేది నెమ్మదిగా లేదా అకస్మాత్తుగా అయినా అభివృద్ధి చెందుతుందట. డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య డయాబెటిస్ సమస్య.. ఇది కూడా కళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ప్రారంభంలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు గుర్తించలేము.. కేవలం తేలికపాటి దృష్టిని మాత్రమే చూడగలం. ఇక ఇందులో రెండు రకాలుగా డయాబెటిస్ ఉన్న వారిలో ఈ రెటినోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా నెలలు నిండకుండా, అతి తక్కువ బరువుతో జన్మించిన పిల్లల్లో మాత్రమే ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తుందని వైద్యులు ఒక పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఒక బిడ్డ త్వరగా జన్మించినప్పుడు ఆ బిడ్డకు రక్త నాళాలు సరిగ్గా పెరగడానికి సమయం ఉండదు కాబట్టి వెంటనే అలాంటి వారిపై ప్రభావం చూపుతుందట.
ఇక దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు కలిగిన వారిపై కూడా ఈ రేటినోపతికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.. అందుచేతనే మీరు ఎప్పుడైనా రక్తపోటు సమస్య వచ్చినప్పుడు ఈ రెటీనా సమస్యతో ఉండేవారు రక్తనాళాలు చాలా చిక్కగా మారి రక్తనాళాలు కుచించుకుపోవడం కి ముఖ్య కారణం అవుతాయి. దీనివల్ల రక్తాన్ని రెటీనాకు చేరకుండా ఆపి వేస్తాయి. అందుచేతనే అధిక రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా ఆవేశ పడకూడదు. అయితే ఈ రెటీనా సమస్య అనేది చాలా ప్రమాదం కావున వైద్యులను సంప్రదించడం మంచిది.