ఇక ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు కూడా చాలా లావుగా మారిపోతున్నారు. ఆహారపు అలవాట్ల వల్లే చాలా మంది ఇలా లావుగా అవుతున్నారు. అయితే ఆ బరువును తగ్గించుకునేందుకు జిమ్ ల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంటారు.అయితే ఇక అవేం అవసరం లేకుండా సులువుగా ఇంట్లో వుండే ఈ చిట్కాలతో చాలా ఈజీగా మీరు బరువు తగ్గొచ్చు. ఇక మీరు బరువు తగ్గాలని అనుకుంటే మీ రోజువారి ఆహారంలో లేత సొరకాయను ఖచ్చితంగా చేర్చుకోవాలి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇది చాలా సులభంగా లభించే కూరగాయ కూడా. సొరకాయ కూరగాయగా.. సూప్ ఇంకా జ్యూస్ రూపంలో బరువు తగ్గడంలో సాయపడుతుంది. సొరకాయలో విటామిన్ బి ఇంకా పీచు పదార్థాలతో పాటు నీరు అనేది ఎంతో పుష్కలంగా లభిస్తుంది. అయితే సొరకాయ శరీరం యొక్క జీవక్రియ రేటును కూడా పెంచడంలో బాగా సాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది.అంతే కాకుండా ఈ కూరగాయ యొక్క గొప్పదనం ఏమిటంటే… ఇది మీ ఆకలిని నియంత్రించడంలో కూడా బాగా సహాయపడుతుంది.
అంతే కాకుండా సొరకాయ జ్యూస్ తాగడం వల్ల చాలా వేగంగా బరువు కూడా తగ్గొచ్చు.సొరకాయలో ఉండే విటామిన్ బి, ఫైబర్ ఇంకా అలాగే నీరు మంచి మొత్తంలో ఉంటాయి. అలాగే సొరకాయలో సంతృప్త కొవ్వు ఇంకా అలాగే
కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో విటామిన్ బి, సి, ఎ, కె, ఇ, ఫోలెట్, ఐరన్, మెగ్నీషియం ఇంకా అలాగే పొటాషియం కూడా ఉన్నాయి. పొట్లకాయ రసం తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోజంతా కూడా చాలా యాక్టివ్ గా ఉండొచ్చు. మధుమేహం ఇంకా అలాగే
కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు కూడా ఈ సొరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అయితే ఇక మీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే సొరకాయ జ్యూస్ తయారు చేసుకోవడం ఎలాగో మనం ఇఫ్పుడు ఈజీగా తెలుసుకుందాం.
ముందుగా మీరు తాజా సొరకాయను తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కులుగా మీరు కట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వాటిని జ్యూసర్ గ్రైండర్ లో వేసి అందులో రసాన్ని తీసుకోవాలి. ఇక అలాగే ఆ తర్వాత ఆ రసాన్ని మొత్తం ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. మీ రుచికి అనుగుణంగా నిమ్మరసం ఇంకా నల్ల ఉప్పును కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న సొరకాయ జ్యూస్ ని ప్రతిరోజూ కూడా తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ఇది శరీరంలో ఉండే చక్కెర ఇంకా అలాగే చెడు
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మీకు సాయపడుతుంది. అందుకే వీలయినంత ఎక్కువగా పొట్ల కాయ లేదా సొరకాయ జ్యూస్ ను రోజూ తాగడం చాలా మంచిది.