వయసు 50 దాటినా యవ్వనంగా ఉండాలా? ఇలా ట్రై చేయండి?

VAMSI
అందం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. అయితే చాలా మందికి యుక్త వయస్సు లో ఎంత అందం గా ఉన్నాను వయస్సు పైబడుతున్నప్పుడు అందగానే  ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే యుక్త వయసులో ఉన్న అందం ఆ తర్వాత ఉండదు. వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతూ వస్తుంది. ముఖం పై ముడతలు రావడం, చర్మం రంగు, మెరుపు తగ్గడం, బరువు పెరగడం వంటి మార్పులు జరిగి అందం తరిగిపోతుంది.    
అయితే చాలా తక్కువ మంది  మాత్రమే వయసు పెరుగుతున్నప్పటికీ తమ గ్లామర్ నీ మాత్రం అలాగే కాపాడుకుంటూ ఎవర్ గ్రీన్ గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో మీరు ఉండాలి అనుకుంటున్నారా...అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...రిజల్ట్ మీకే తెలుస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే ఆ సలహాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.

వయసు లో ఉన్నప్పుడు చాలామంది వర్కౌట్స్ బాగా చేస్తుంటారు ..అయితే చాలామంది వయసు మీద పడుతున్న కొద్ది వర్క్ అవుట్స్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇలా చేయకూడదు 50 సంవత్సరాల వయసులోనూ వర్కౌట్ చేయవచ్చు... అలా చేయడం ఎంతో అవసరం. అందం,ఆరోగ్యం రెండు కావాలంటే వర్కౌట్ చేయటం మంచిది. అయితే యంగేజ్ లో చేసినంత హేవిగా చేయరాదు....నిపుణులు సలహాలు తీసుకుని వయసుకు తగ్గట్టు వ్యాయామాలు చేయాలి. దాని ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ గా కూడా ఉంటారు.
* తాజా పండ్లు .... కూరగాయలు
రెగ్యులర్ గా ఇవి మీ ఆహారం లో ఉంటే ఆకర్షవంతమైన  చర్మం మీ సొంతమవుతుంది. అలాగే చర్మంలో కాంతి కూడా పెరుగుతుంది. నీటిని కూడా పుష్కలంగా తాగాలి అప్పుడే చర్మం పొడిబారకుండా మృదుత్వం కోల్పోకుండా నిగనిగలాడుతుంది. విటమిన్ డి కోసం సూర్యకాంతి పడే ప్రాంతం లో కాసేపు సూర్యోదయం సమయం లో ఉండటం మంచిది. ఈ నియమాలు పాటించడం వలన తప్పకుండా యవ్వనంగా కనిపిస్తారు అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: