వావ్.. జామకాయ లాభాలు తెలిస్తే షాక్..!!

Divya
ఏ సీజన్లో అయినా సరే విరివిగా లభించే పండ్లలో జామకాయలు ముందు వరుసలో ఉంటాయని చెప్పవచ్చు.. నిజానికి ఒక జామకాయ తింటే చాలు 10 ఆపిల్ పండ్ల తో సమానం అని.. జామ కాయ తింటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే అని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.. తక్కువ ధరకే అందుబాటులో ఉండే జామకాయలు అంటే చాలామందికి చిన్నచూపే కాదు.. తినడానికి కొంతమంది పెద్దగా ఆసక్తి కూడా చూపరు.. ఇక జామకాయలలో ఎన్నో ఔషధగుణాలు ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.

జామకాయలో దాగివున్న పోషకాల విషయానికి వస్తే.. పాస్పరస్, ఐరన్ ,ఫోలిక్ యాసిడ్ ,పొటాషియం , విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. వేసవి కాలం లో అధికంగా దప్పిక వేస్తుంటే జామపండు ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తాగే నీటిలో వేసి 2 గంటల తర్వాత ఆ నీటిని తాగితే దప్పిక తీరుస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జామ పండును తీసుకుంటే ఆరోగ్యానికి మంచి పోషకాలు లభిస్తాయి. ఇక జామపండులో ఒత్తిడి, జీవన శైలి  లోపం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.
జామ పండ్ల లో దొరికే పొటాషియం  అరటి పండులో కన్నా ఎక్కువగా పొటాషియం లభిస్తుంది. ఇక అంతే కాదు జామకాయ తినడం వల్ల చిగుళ్లు , దంతాలు కూడా గట్టిపడతాయి. దంతాల నుంచి వచ్చే రక్తస్రావం ఆగిపోవడమే కాదు ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మధుమేహం ఉన్నవారు జామకాయ ను పుష్కలంగా తినవచ్చు. బరువు  తగ్గడానికి ఉపయోగపడే జామకాయ శరీరంలో చేరిన వైరస్ లను దూరం చేస్తుంది. అంతే కాదు జలుబు,  ఆకలి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగు పడటమే కాదు హార్మోన్ల సమస్య కూడా తీరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: