సన్నబడాలంటే ఈ పప్పులు తినాల్సిందే..?
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బారు జానెడు ముందుకు వస్తోంది. అలసట, శరీర బరువు , నడవాలంటే ఆయాసం ఇలా చాలా మంది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి రక్తనాళాలు దెబ్బ తీసి పూడికలు ఏర్పడేలా చేయడం గమనార్హం. ఇక ఫలితంగా గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి.
ఇక నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వేదిక ప్రకారం పప్పులలో కరిగే ఫైబర్ ఉంటుందట. ఇది జీర్ణ వ్యవస్థలోని కొలెస్ట్రాల్ తో కలిసి పోయి శరీరం నుంచి మలవిసర్జన రూపంలో బయటకి తొలగిపోతుంది. పప్పులో ఉండే ఫోలేట్ , మెగ్నీషియం వంటివి గుండెజబ్బుల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా రక్షించడానికి ఈ ఖనిజాలు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మనం మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు ఉలవలు వంటి పప్పు దినుసుల వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవచ్చు. ఇక ఎవరైనా ఈ పప్పులు తినడానికి ఇష్టపడకపోతే వీటిని ఏదైనా కూరలాగా చేసుకొని తింటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు అలాగే బరువును తగ్గించుకోవచ్చు కూడా