ఎండాకాలంలో అసలు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో తెలుసా..?
వేసవికాలంలో ఎలాంటి మసాలా దినుసుల కు దూరంగా ఉండాలి అంటే..
1.అల్లం:
అల్లం ఉపయోగించనిదే ఏ కూరకు మంచి రుచి రాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లంతో టీ తయారు చేసుకొని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అధిక ఘాటు కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన చెమట వస్తుంది. అలాగే మధుమేహం, రక్తస్రావం సమస్యలు ఉన్నవారు దీనిని అసలు తినకూడదు. ఈ కాలంలో అల్లం తినడం వల్ల గుండెల్లో మంట , విరేచనాలు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి
వెల్లుల్లి
వేసవికాలంలో వెల్లుల్లిని అధికంగా తినడం వల్ల నోటి దుర్వాసన, రక్తస్రావం , యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు అధికమవుతాయి. అలాగే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. చలికాలంలో వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు ఉన్నా.. వేసవి కాలంలో మాత్రం వీటికి దూరంగా ఉండాలి.
మిరియాలు..
శరీరంలో వేడిని అధికం చేస్తాయి. కొన్ని రకాల అలెర్జీలకు కూడా కారణమయ్యే నల్ల మిరియాలను వేసవికాలంలో అసలు తినకూడదు.
వేసవి కాలంలో అధికంగా తినాల్సిన పదార్థాలు ఏమిటంటే పుదీనా , కొత్తిమీర వంటివి తినడం వల్ల శరీరానికి చల్లదనంతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.