ఈ మామిడి పండ్లు తింటే యమా డేంజర్‌?

Chakravarthi Kalyan
ఎండాకాలం వచ్చేసింది.. ఇక మామిడి వండ్ల సీజన్‌ వచ్చినట్టే.. అయితే.. మందులతో మాగబెట్టిన పండ్లు తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు.. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మార్కెట్లపై దాడులు చేస్తున్నారు. తాజాగా బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.  ఈ తనిఖీల్లో మామిడిపళ్లను మగ్గ  పెట్టేందుకు ఎక్కువ మొత్తంలో ఇతిఫాన్  మందు పాకెట్ల వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మామిడి పండ్లను ఎగుమతులు చేసే డబ్బాలలో ఈ ఇతిఫాన్  ప్యాకెట్ ను 10 కేజీలకి ఒక ప్యాకెట్ వాడాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ  పాకెట్లను వ్యాపారులు  వాడుతున్నారు.


ఎక్కువ మోతాదులో ఈ మందును వాడి మామిడి పండ్లను త్వరగా మగ్గేలా చేస్తున్నారు. కానీ ఇలా మగ్గిన పండ్లను తింటే అనారోగ్యం పాలవడం ఖాయయమని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై గతంలో పలుమార్లు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశామని అధికారులు అన్నారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో పలు కేసులు నమోదు చేశామని సీనియర్ సైంటిఫిక్ అధికారి లక్ష్మీ నారాయణ రెడ్డి గుర్తు చేశారు.


ఇప్పుడు కూడా కొన్ని నమూనా పండ్లను లాబ్ కి తీసుకుని వెళ్లి ల్యాబ్ లో పరీక్షింపడేసి  వచ్చిన రిపోర్ట్ ఆధారంగా  చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు చేపడతామని అధికారులు అంటున్నారు.  ఆ తర్వా అధికారులు పాకెట్ల వాడకంపై వ్యాపారులకు  అధికారులు అవగాహన కల్పించారు.  పండ్లను నిబంధనలకు లోబడే మాగపెట్టేలా చూడాలని.. లేకుంటే  చట్టపరంగా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


అయితే.. అధికారులు ఇలా దాడులు చేయడం.. హెచ్చరించడం.. ఆ తర్వాత మళ్లీ వ్యాపారులు అవే మందులు వాడటం కామన్ అయ్యింది. అందుకే ముందు వినియోగదారుల్లో చైతన్యం రావాల్సి ఉంది. మామిడి పండ్లను స్వయంగా తనిఖీ చేసుకుని.. సహజంగా మగ్గినట్టు కనిపిస్తేనే కొనుగోలు చేయాలి. పండును వాసన చూసి కొంత వరకూ సహజంగా పండిందా లేదా అన్నది గుర్తించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: