షుగర్ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక అస్సలు పోదు.ఇక నేటి కాలంలో మధుమేహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగాకూడా పెద్ద సమస్యగా ఉద్భవించింది. ఇది మన జీవితంలో ఎప్పుడైనా రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో టైప్ 1 ఇంకా అలాగే టైప్ 2 అనే రెండు రకాలు ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి దాని లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఇక వాటి గురించి తెలుసుకుందాం.
1. తరచుగా ఆకలి వెయ్యడం..షుగర్ వ్యాధిగ్రస్తులకు మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. మీరు ఇలాంటి సమస్యని కనుక ఎదుర్కొంటున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని కలిసి మీ షుగర్ పరీక్ష చేయించుకోండి.
2. తీరని దాహం వేస్తుంది...మీ గొంతు కనుక పదే పదే పొడిగా మారితే నీరు తాగిన తర్వాత కూడా దాహం తీరకుంటే చాలా ప్రమాదం. ఈ పరిస్థితిలో మీరు షుగర్ లెవల్స్ని ఖచ్చితంగా చెక్ చేయాలి.
3. తరచుగా మూత్ర విసర్జన అవ్వడం..మీరు రాత్రి సమయంలో నాలుగు లేదా ఐదు సార్లు మూత్ర విసర్జన చేయడానికి లేచినట్లయితే ఖచ్చితంగా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మధుమేహంకి సంబంధించిన పెద్ద లక్షణం.
4. బరువు తగ్గడం జరుగుతుంది..బరువు అకస్మాత్తుగా తగ్గడం కనుక ప్రారంభిస్తే అది ఖచ్చితంగా మధుమేహం లక్షణం కావచ్చు. కాబట్టి సమయానికి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
5. అలసిపోవడం జరుగుతుంది.ఒకప్పుడు 10 నుంచి 12 గంటల పాటు అలసిపోకుండా పని చేసినవారు ఇప్పుడు 8 గంటల పని చేస్తేనే చాలా అలసిపోతున్నట్లు అనిపిస్తే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే.30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఎప్పటికప్పుడు మధుమేహానికి చెక్ పెట్టడం అవసరం. మధుమేహం లక్షణాలు కనుక మీలో కనిపిస్తే వెంటనే ఆలస్యం అనేది చేయకుండా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే అది చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది.