పాదాల పై చెప్పులు గుర్తులు కనిపిస్తున్నాయి.. అయితే ఇలా చేయండి..!!

Divya
ప్రతి ఒక్కరు ఎక్కువమంది ముఖం పై శ్రద్ధ పెడుతూ ఉంటారు కానీ పాదాలను ఎవరూ పట్టించుకోరు. దీంతో వాటిపై విపరీతంగా టాన్ పేరుకుపోతూ ఉంటుంది. దీంతో చెప్పులు వేసుకునేటప్పుడు వాటి గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి పాదాలు చాలా అసహ్యంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందులో ముఖ్యంగా కలబంద గురించి చెప్పుకోవాలి. ఇందులో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీనిని మీ పాదాల పైన అప్లై చేసిన తర్వాత పాదాలను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.. అంతేకాకుండా రెండు టేబుల్ స్పూను తాజా అలోవెరా జెల్ ను పట్టించి.. బాదం నూనెతో కలిపి పాదాలకు పట్టిస్తే చాలా మృదువుగా తయారవుతాయి.

ఇక మరొకటి ఏమిటంటే ముందు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ ను తీసుకొని.. అందులో కాస్త పెరుగు లేదా పాలు కలిపి పేస్టుగా చేసుకొని ఆ పేస్ట్ ను పాదాలపై అప్లై చేసి పాదాలను కడుక్కుంటే చాలా మృదువుగా ఉంటాయి. ఇక ఇందులోకి కొంచెం పసుపు చల్లటి పాలు తీసుకుని పేస్టులా పట్టించుకుంటే ఇంకా మృదువుగా తయారవుతాయి.

ఇక మరొకటి ఏమిటంటే ఒక స్పూన్ గంధము, అందులోకి కొద్దిగా రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి బాగా టేస్ట్ గా చేసిన తర్వాత.. దానిని పాదాలకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుని నట్లయితే.. పాదాల మీద ఉన్న చారలు పోతాయి.

మరొకటి ఏమిటంటే ఒక స్పూన్ బాదం పొడి, గంధం పొడి, రోజు వాటర్ లోకి పాలు కలిపి పేస్టులా చేసి దానిని పాదాలపైన అప్లై చేస్తే పాదాలు చాలా చెత్తగా మృదువుగా తెల్లగా తయారవుతాయి. అంతేకాకుండా పాదాల పైన ఉండే టాన్ మొత్తం వీటి ద్వారా తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: