నల్ల ద్రాక్ష తినడం వల్ల.. ఎన్ని ప్రయోజనలో తెలుసా..?
1). నల్ల ఎండు ద్రాక్షలు ప్రోటీన్లు చాలా పుష్కలంగా ఉంటాయి కనుక ఇది కండరాలు, ఎముకలు బలంగా ఉండడానికి.. రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.
2). నల్ల ఎండు ద్రాక్ష లో ఉండే విటమిన్స్ వల్ల ఇతర యాంటీ ఆక్సిడెంట్లు వల్ల కళ్ళకు చాలా మేలు చేస్తాయి. కళ్ళకు హాని కలిగించే కొన్ని ఫ్రీరాడికల్స్ నుండి కళ్ళను రక్షించడంలో ఇవి బాగా సహాయపడుతాయి. అలాగే కంటి శుక్లాల వల్ల సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయం పూట పరగడుపున తినడం వల్ల కంటి చూపు చాలా మెరుగు పడుతుందట.
3). రక్తహీనత సమస్య తో బాధపడే వారు వీటిని తినడం వల్ల ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఇందులో ఐరన్ ఉండడంవల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
4). నల్ల ఎండు ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. ఇందులో విటమిన్, ఐరన్ క్యాల్షియం వంటివి పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెంచడానికి చాలా సహాయపడతాయి.
5). మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండెపోటు వంటి సమస్యల నుండి దూరం చేస్తాయి. గుండె జబ్బుల నుండి మనల్ని మనం రక్షించుకోవడనికి ఈ ఎండుద్రాక్ష చాలా మేలు చేస్తుంది.