షుగర్ వ్యాధిగ్రస్థులపై ఐసిఎమ్ఆర్ నివేదిక విడుదల !
అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం చాలా మంది చెబుతున్న మాట ఏమిటి అంటే... ఎంత నియమాలు పాటిస్తున్నా డయాబెటిస్ పెద్దగా కంట్రోల్ లోకి రావడం లేదు అన్నది తెలుస్తోంది. డయాబెటిస్ పేషంట్స్ లలో ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతున్నారని తెలుస్తోంది. అదే కాకుండా మధుమేహంతో పాటు రక్తపోటు ఉన్నవారిలో 50 శాతం మందికి వారి రక్తపోటు కూడా నియంత్రణలో ఉండటం లేదని ఐసీఎంఆర్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. 90 శాతం మంది భారతీయులు బిపి, షుగర్ వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోలేక పోతున్నారని సమాచారం. 2008 నుండి ఇందుకు సంబందించిన అధ్యయనం మొదలవ్వగా ఈ అధ్యయనం లోని వివరాలు ఏప్రిల్ 2022లో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురింపబడ్డాయి.
అదీకాక డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ రకాల వైరస్లు మానవాళిని వెంటాడుతున్న నేపథ్యంలో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మరింత ప్రభావం చూపుతాయి అన్నది తెలిసిందే. కాబట్టి ఇక నుండి అయిన మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, జీవన శైలి ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.