డయాబెటిస్ వచ్చిందా.. లేదా.. ఈ లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు..!!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. మారుతున్న జీవన శైలి కారణంగా డయాబెటిస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీనికి తోడు అధిక క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం.. సరిగ్గా శారీరక వ్యాయామం చేయకపోవడం , మానసిక ఒత్తిడి పెరగడం వల్ల డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణాలని డయాబెటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వారు తెలియజేశారు. అధిక పని వల్ల వివిధ రకాలుగా పనిచేసేవారు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న ట్లుగా తెలియజేశారు.

మధుమేహం వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం ఒక పొరపాటు.. ఇప్పుడు ఎక్కువగా యువతీ యువకులలో కూడా ఈ డయాబెటిస్ కనిపించడం రెండు సంవత్సరాల నుండి ఎక్కువైందని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది మందిలో కనీసం ఒక్కరికైనా మధుమేహం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50.37 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నట్లుగా డయాబెటిస్ ఫెడరేషన్ వారు తాజాగా తెలియజేశారు. అయితే డయాబెటిస్ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు గుర్తించాలి అంటే ఉదయం పూట ఎటువంటి ఆహారం తీసుకోక ముందు..70-100 రేంజ్ లో ఉన్నట్లు అయితే అది సాధారణ స్థాయి అని..WHO సంస్థ నిర్ధారించింది. ఇక ఈ రేంజ్ నుంచి 100-125 మిల్లీగ్రాములకు చేరితే ఫ్రీ డయాబెటిస్ అని అర్థము.126 పైన ఉంటే మధుమేహం వచ్చినట్లుగా గుర్తించవచ్చు. అయితే కొంత మంది వైద్యులు తెలిపినట్లు వాటిపై కొంత వివాదం కూడా ఉన్నదని తెలిపారు. అయితే ఫార్మా కంపెనీల లాభాల కోసం ఈ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నారని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.

2). ముఖ్యంగా అధిక దాహం వేయడం, రాత్రి సమయాలలో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం, విపరీతమైన అలసట, ఎటువంటి ప్రమేయం లేకుండా బరువు తగ్గుట.. కంటిచూపు తగ్గిపోవడం,  గాయాలు మానకపోవడం వంటివి డయాబెటిక్స్ లక్షణాలని హెల్త్ సర్వే తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: