మొక్కజొన్న కండి మీద ఉండే పీచు ( కార్న్ సిల్క్ ) ని వివిధ దేశాలలో సంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఇంకా అనేక వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు , మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు, కిడ్నీ స్టోన్స్ ఇంకా అలాగే ప్రోస్టేట్ వాపు వంటి వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ రక్తప్రసరణ లోపాలు, గుండె వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు, అలసట ఇంకా అలాగే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ నీటిని ప్రతి రోజూ తాగడం వలన కిడ్నీ పని తీరు అనేది బాగా మెరుగుపడుతుంది.మొక్కజొన్న కంకుల లాగా ఈ పట్టులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో మొక్కజొన్న పట్టుతో టీ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది.అలాగే ముఖ్యమైన అవయవాల పనితీరు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో చాలా ఈజీగా సహాయపడతాయి.ఈ టీని తాగడం వల్ల రక్తపోటు ఇంకా అలాగే షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో కూడా ఈ టీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ టీలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంకా అలాగే మొక్కజొన్న పట్టుతో చేసే టీ ని తాగడం వల్ల అజీర్తి వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగుపడి మలబద్దకం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇక అంతే కాకుండా ప్రసవానంతరం స్త్రీలు ఈ టీ ని తాగడం వల్ల రక్తస్రావం అనేది అధికంగా అవకుండా కూడా ఉంటుంది.ఈ టీ ని ప్రతిరోజూ తాగుతూ ఉండడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు కూడా ఈజీగా తగ్గుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మొక్కజొన్న పీచుని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసుకుని దాన్ని మరిగించాలి. ఇక బాగా మరిగిన నీటిలో నిమ్మరసం వేసుకునివేడివేడిగా తాగాలి. అలాగే ఇలా రోజుకి రెండు సార్లు తాగడం వలన శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు కూడా మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి.ఈ టీ ని చిన్న పిల్లలు, గర్భిణీలు ఇంకా అలాగే ఇతర వ్యాధులకు మందులు వాడే వారు మాత్రం తాగరాదు. ఇంకా అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఈ టీ ని తాగరాదని వైద్యులు సూచిస్తున్నారు.