పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఈ సిరప్ తో చెక్ పెట్టండి..!!

frame పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఈ సిరప్ తో చెక్ పెట్టండి..!!

Divya
దాదాపు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పొడి దగ్గు తో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడేవారు సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. అసలు ఈ పొడి దగ్గు ఎందుకు వస్తుందో తెలుసా..? యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి అలర్జీ వరకు చాలా విషయాలలో పొడి దగ్గు కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మనం రాత్రి సమయాలలో అకస్మాత్తుగా పొడి దగ్గు కలిగి ఉంటే అప్పుడు చికిత్స చేయించుకోవడం అవసరం. అయితే నేచురల్ దగ్గు సిరప్ ని ఇంట్లోనే సులువైన మార్గాలలో తయారు చేసుకోవచ్చట. ఇంట్లో తయారు చేసే దగ్గు సిరప్ పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
పొడి దగ్గు కోసం సిరప్ గా ఉపయోగించాలి అంటే.. మనం కిచెన్ ని ఒకసారి పరిశీలిస్తే అందులో సులువైన మార్గంలోనే దగ్గు సిరప్ ను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక టీ స్పూన్ నిమ్మరసం, కాస్త తురిమిన అల్లము, ఒక కప్పు నీరు, ఒక ఫోన్ తేనె, కాస్త నల్లమిరియాలు, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వంటివి అవసరమవుతాయి. ఇక వీటన్నిటి ని ఒక పాత్రలో వేసి బాగా మరిగించి ఆ మిశ్రమాన్ని గాలి చొర పడకుండా గాజు పాత్రలో నిలువ చేయాలి.

ఇక ఈ సిరప్ ప్రతిరోజు తాగడం వల్ల కొద్ది రోజులకి గొంతులో ఉండి ఇన్ఫెక్షన్ పోవడమే కాకుండా దగ్గు నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ను కూడా బయటకు పంపించడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఇక ఇవే కాకుండా దగ్గు ఆకులను, మిరియాలు వంటివి మిక్స్ చేసుకొని.. బాగా నమ్మిలిన తర్వాత ఆ రసాన్ని మింగిన తర్వాత బయటికి ఉమిసివేయడం వల్ల కూడా దగ్గు నుండి విముక్తి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: