చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
ఒక ఆఫ్ లీటర్ చెరుకు రసంలో 26.56 క్యాలరీల ఎనర్జి ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, క్యాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇలా పుష్కలమైన ప్రోటీన్లు ఉన్న డ్రింకును తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు కూడా సూచిస్తున్నారు. చెరుకు రసం నిత్యం తాగడం వల్ల మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అంతేకాకుండా కిడ్నీలో ఉండే రాళ్ల సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కిడ్నీల పనితీరు కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి చెరుకు రసం తాగడం చాలా మంచిది.
ఇక కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం చెరుకు రసం తాగడం వల్ల లివర్ కి చాలా మంచిది. ముఖ్యంగా పచ్చకామర్లతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల లివర్ పనితీరు చాలా మెరుగ్గా పనిచేస్తుంది.
చెరుకు రసం తాగడం వల్ల మన శరీరానికి ఎనర్జీ కూడా వస్తుంది. చెరుకు రసంలో ఉండే కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో డీహైడ్రేట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.. చెరుకు రసం తాగడం వల్ల నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.. చెరుకు రసంలో ఉండే మినరల్స్ నోటి దుర్వాసనను తగ్గించడంలో చాలా సహాయపడతాయని చెప్పవచ్చు.