నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి అద్భుతమైన చిట్కా..?
అందుకే నిద్రలేమిని వదిలించుకోవడం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక పొడిని మీరు పాలలో కలుపుకొని రోజు తాగినట్లయితే నిద్రలేమి సమస్యను సులభంగా తరిమికొట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి దానిపైన పాన్ పెట్టి అందులో కొన్ని బాదం పప్పులు, గుప్పెడు పల్లీలు, మూడు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, మూడు టేబుల్ స్పూన్ల సన్ ఫ్లవర్ సీడ్స్, రెండు టేబుల్ స్పూన్ల సోయాబీన్స్, గుప్పెడు వాల్నట్స్ ఒకదాని తర్వాత మరొకటి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పదార్థాలను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి. ఇక ఈ పొడిని నిల్వ ఉంచుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే వాడుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ ఈ పౌడర్ ను వేసుకొని కొద్దిగా బెల్లం తురుము కూడా కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు నిద్ర పోయేముందు తీసుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది. ఇక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మీ మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది.