బోర్లా పడుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?

praveen
ప్రతి మనిషి జీవితంలో నీరు ఆహారం ఎంత ముఖ్యమో సరైన నిద్ర కూడా అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజూ తప్పనిసరిగా నిద్రపోతూ ఉండాలి. అది కూడా దాదాపు ఏడు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఆరోగ్యంగా వుండ గలుగుతాము అంటూ ఎంతో మంది నిపుణులు చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఒత్తిడితో కూడిన జీవితంలో ఎవరు కూడా నిద్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పాలి. తక్కువ సమయం పాటు నిద్రపోయి ఎక్కువ సమయం పాటు పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 అయితే ప్రతి మనిషికి నిద్ర ఎంత అవసరమో డాక్టర్లు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. అదే సమయంలో మనం పడుకునే విధానం కూడా ఎలా ఉండాలి అనే విషయాలపై డాక్టర్లు సూచనలు ఇస్తూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో పడుకుంటూ ఉంటారు  ఇక వారికి అదే అలవాటుగా మారిపోతుంది. ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు అలాంటి భంగిమలో పడుకున్నప్పుడు మాత్రమే వారికి నిద్ర పట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంతోమంది బోర్లా పడుకోవడానికి ఎక్కువగా అలవాటు పడి పోతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఒకవేళ మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బోర్లా పడుకోవడం ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు. ఇలా నిద్రలో బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక మెడ మరియు భుజం నొప్పి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. అయితే గర్భిణీలు ముఖ్యంగా ఇలా నిద్రపోవడానికి దూరంగా ఉండాలి అంటూ చెబుతున్నారు. అంతేకాదు బోర్లా పడుకోవడం వల్ల ముఖంపై ముడతలు వచ్చే అవకాశం  ఉంటుందట. సాధ్యమైనంత వరకు వెనక్కి తిరిగి లేదా పక్కకి తిరిగి పడుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: