ప్రయాణాల్లో వాంతులు కాకుండా ఇలా చెయ్యండి?

Purushottham Vinay
మనం గమనించేవుంటాం మనలో చాలా మంది వ్యక్తులు బస్సులో, రైలులో, కారులో లేదా విమానంలో మరేదైనా ఇతర వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు, తలతిరగడం, వికారం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. విమాన ప్రయాణంలో మీ సీటు ముందు సిక్‌నెస్ బ్యాగ్ లేదా వాంతి చేసుకోవడానికి ఓ బ్యాగ్ ఉంటుంది. ఇది వాంతులు అయినప్పుడు ఉపయోగించేందుకు. అదే మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అలాంటి సదుపాయాలు ఉండకపోవచ్చు. అయితే మీకు ఇలాంటి సమస్య ఉంటే ప్రయాణం చేసే సమయంలో ఈ మూడు వంటింటి పదార్ధాలను మీ బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది.నిమ్మకాయలు పూర్తిగా పోషక లక్షణాలను, ఔషధ స్వభావాన్ని కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.. సిట్రస్ పండ్లలో ఇది కూడా ఒకటి.. ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది ప్రయాణ సమయంలో వాంతులు, వికారం లాంటి సమస్యలు వచ్చిన సమయంలో సహాయపడుతుంది. ప్రయాణ సమయంలో నిమ్మకాయను వెంట తీసుకెళ్లడం మంచిది. నిమ్మకాయ రసం కొద్దిగా నోట్లో వేసుకోవడం.. కాసేపు ఆ నిమ్మ వాసనను చూస్తే వాంతులు, వికారం ఉంటే వెంటనే ఆగిపోతాయి. కావాలంటే నిమ్మరసాన్ని వాటర్ బాటిల్ లో కూడా క్యారీ చేయవచ్చు.



మీరు మామూలు రోజుల్లో తప్పనిసరిగా అరటిపండు తింటూ ఉంటారు. అయితే ప్రయాణంలో ఉన్నప్పుడు బ్యాగ్‌లో పెట్టుకోండి. ఈ పండు పొటాషియంను పునరుద్ధరించే గుణం కలిగి ఉంటుంది. వాంతిని చాలా వరకు దూరం చేస్తుంది. లాంగ్ డ్రైవ్ సమయంలో వాంతులు లేదా తల తిరగడం వంటి సందర్భాల్లో అరటిపండు తినండి.మనం వంటకాల్లో రుచిని పెంచేందుకు మసాలా దినుసులలో అల్లంను ఉపయోగిస్తుంటాం. కానీ మీకు ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నట్లు అనిపిస్తే.. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు వికారంగా అనిపించిన వెంటనే అల్లంను కొద్దిగా నోట్లో వేసుకోండి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. సమస్య పెరిగినప్పుడు మీరు పచ్చి అల్లంను బ్యాగ్‌లో తీసుకెళ్లండి. కావాలంటే అల్లం మిఠాయి, అల్లం టీ, థర్మాస్‌ఫ్లాస్క్‌లో అల్లం కలిపిన వేడినీళ్లు కూడా ఉంచుకోవచ్చు.కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బంది కనుక ఉంటే ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా వెంట తీసుకువెళ్ళండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: