మామిడి ఆకుల వల్ల ఉపయోగాలు తెలుసా..?
ఎక్కువ శాతం మంది డయాబెటిస్ పేషెంట్లు తమ రక్తంలోనే ఉంటే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడం కోసమే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండనే ఉంటారు. ఈ క్రమంలోని కొంతమంది మెడిసిన్ ద్వారా మరికొంతమంది వారికి తమకు తోచిన ఆరోగ్య చిట్కాలను ఉపయోగించి తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు మామిడి ఆకులు ఉపయోగించడం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. మామిడి ఆకులలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయట.
మామిడి ఆకులలో ఉంటే యాంటీ మైక్రోబియల్ గుణాలు మన శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. మామిడి ఆకులలో ఉండే విటమిన్ సి మధుమేహంతో పాటు కొవ్వు పదార్థాలను కూడా అదుపులో ఉంచేలా చేస్తుంది. అయితే మనం ప్రతిరోజు కొన్ని ఆకులను తీసుకొని నీళ్లలో ఉడకబెట్టి ఆ తర్వాత.. ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల డయాబెటిస్ రోగులకు చక్కటి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా కనీసం నెలలో 15 రోజులు చేస్తే మన శరీరంలో ఉండే చక్కెర స్థాయి అదుపులోకి వస్తాయట. ఈ ఆకులలో చేదు గుణం ఉంటుంది కనుక చక్కెర స్థాయిని నియంత్రించే గుణం కలదు.