ఉల్లిపాయని ఇలా కడిగితే వాసన రాదు?

Purushottham Vinay
ఉల్లిపాయ ఇచ్చే రుచి గురించి అందరికి తెలిసిందే. ఈ ఉల్లిపాయను దాదాపు ప్రతి కూరల్లో కూడా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఉల్లిపాయలతో కూరగాయల రుచి అనేది మరింత పెరుగుతుంది. ఉల్లిపాయను సలాడ్‌గా కూడా తింటారు. కానీ ఉల్లిపాయను కట్ చేయడం..కడగడం చాలా పెద్ద పని. ఎందుకంటే దానిని కత్తిరించేటప్పుడు. కళ్లలో నుంచి నీళ్లు వచ్చేస్తుంటాయి. అదే సమయంలో వాటితో చికాకు ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఇతర సమస్య ఏమిటంటే, కడిగిన తర్వాత కూడా ఉల్లిపాయ వాసన అస్సలు పోదు. అయితే ఉల్లిపాయల వాసనను సులభంగా తొలగించే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు ఉల్లిపాయను సాదా నీటితో కడిగినప్పటికీ దాని నుంచి వాసన వస్తుంది. అప్పుడు మీరు దాని వాసనను తొలగించడానికి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి.


దీని కోసం, ఒక గిన్నెలో కొంచెం గోరువెచ్చని నీటిని పోసి, దానికి రెండు చెంచాల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయను కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత మిశ్రమం నుంచి ఉల్లిపాయను తీసి కడిగి వాడాలి.వాసనను తొలగించడానికి మీరు గోరువెచ్చని నీటిని కూడా ఉపయోగించవచ్చు . దీన్ని శుభ్రం చేయడం వల్ల ఉల్లిపాయ నుంచి బ్యాక్టీరియా, టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి. మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయను కట్ చేసి గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టండి. కొంత సమయం తరువాత ఉల్లిపాయ నుంచి వాసన పోతుంది.ఉల్లిపాయల నుంచి వాసనను తొలగించడానికి వెనిగర్ నీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో కొంచెం గోరువెచ్చని నీటిని పోసి, దానికి రెండు చెంచాల వెనిగర్ జోడించండి. రెండింటినీ సరిగ్గా కలపండి. ఆ తర్వాత ఉల్లిపాయను కట్ చేసి కాసేపు అందులో ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయను తీసి నీళ్లతో కడిగి వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: