బయట పండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త?

Purushottham Vinay
బయట పండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త?

ఈ రోజుల్లో తినే పదార్ధాలు అన్నీ కూడా చాలా కలుషితం అవుతున్నాయి. కలుషితం అవ్వట్లేదు. కలుషితం చేస్తున్నారు. చాలా మంది వ్యాపారులు కూడా తమ స్వలాభాల కోసం తినే పదార్ధాలను కలుషితం చేస్తున్నారు. బయట జంక్ ఫుడ్ ఒక్కటే అనుకుంటే ఏకంగా పండ్లని కూడా కలుషితం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ, వ్యాపార, క్రీడా, తదితర పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ మంది కూడా పండ్లని తీసుకుంటున్నారు.ఇంకా అలాగే వైద్యులు కూడా పండ్లు జాతులు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఆరోగ్యానిచ్చే పండ్లు, కూరగాయలను సైతం కొంత మంది వ్యాపారులు రసాయనాలతో మాగపెడుతున్నారు. దీంతో ప్రజలు అరోగ్యం బారితన పడుతున్నారు.తక్కవ కాలంలో ఎక్కవ సంపాదించాలనే ధ్యేయంతో ఎక్కవమంది వ్యాపారులు గోదాంలో అరటి, బొప్పాయి, కర్బూజ, ఆపిల్‌ పక్వానికి రాకముందే పలు రకాల రసాయనాలను పూస్తున్నారు. దీనివల్ల వాటిలో సహజత్వం కోల్పోయి అధికంగా మెరుపు కనిపిస్తుంది. దీంతో కొనుగోలు దారులు సులువుగా మోసపోతున్నారు. అయితే అన్ని కాలాల్లో కూడా అరటి పండ్లకు గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కార్బన్‌మోనాక్సైడ్‌ పౌడర్‌ను పిచికారీ చేయిస్తున్నారు. 



లిక్విడ్‌ రూపంలో మరికొన్ని రసాయనపదార్థాలు వినియోగించిన బకెట్లలో అరటి గెలలు వేసి మగ్గబెడుతున్నారు.ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులుపై దాడులు చేయాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వ్యాపారులు అరటి గెలలు వేలాడిదీసి, వాటికి కార్బైడ్‌తో మగ్గపెడుతున్న విషయం తెలిసినా ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఆహార భద్రతా చట్టం 2006 (ఫుడ్‌సేప్టీ స్టాండర్డ్‌యాక్ట్‌)ప్రకారం ప్రజలు ఆహారపదార్థాలు కలుషితం చేస్తున్నవారిపై దాడులు చేయాలి. పండ్లపై కార్బైడ్‌ వినియెగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు మాత్రం జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: