పొడి దగ్గుని ఈజీగా తగ్గించే చిట్కాలు?

Purushottham Vinay
దగ్గు అనేది మంచిదే. ఎందుకంటే దాని వలన శ్వాసనాళాలు శుభ్రమవుతాయి. శ్లేష్మం వంటి వ్యర్థాలు వాయునాళంలో, గొంతులో పేరుకుపోయినప్పుడు.. మన శరీరం దానిని దగ్గు ద్వారా బయటకు పంపిస్తుంది.అయితే, వరుసగా చాలా రోజులు కొనసాగితే మాత్రం ఆరోగ్యానికి ఇబ్బందే. చాలా మందికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు పొడి దగ్గు సమస్య ఉంటుంది. ఈ పొడి దగ్గు నిద్రకు భంగం కలిగించడమే కాకుండా ఛాతీ నొప్పిని కూడా కలిగిస్తుంది. అయితే, రాత్రిపూట వచ్చే పొడి దగ్గుకు ఇంటి నివారణలతో చెక్ పెట్టొచ్చు.గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రాత్రిపూట వచ్చే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ వేడి నీటి వల్ల అనేక సమస్యలు సమసిపోతాయి. గొంతు సమస్యలు సహా, పొడిదగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మరొక గొప్ప మార్గం నల్లమిరియాలు, ఉప్పు. ఒక పాత్రలో నల్లమిరియాల పొడి తీసుకుని, దానికి కొద్దిగా ఉప్పు కలపాలి. దీంతోపాటు కొంచెం తేనె కూడా కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తింటే పొడి దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


పొడి దగ్గు సమస్యను దూరం చేయడంలో తులసి ఆకులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. తులసి ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు కొన్ని తులసి ఆకులను తేనెతో కలిపి తినాలి. ఇది దగ్గు సమస్యను తగ్గిస్తుంది.బెల్లం వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సహజ చక్కెరను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. పొడి దగ్గు పోవాలంటే బెల్లం, అల్లం కలిపి తినాలి. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా బెల్లం వేడి చేసి అందులో అల్లం తురుము గానీ, అల్లం రసం గానీ కలపాలి. కొన్ని రోజులు దీనిని ఇలాగే తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: