అందరూ కూడా ఉదయాన్నే ఒక కప్పు కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. నిద్ర నుంచి బయటపడటానికి ఇది చాలా సులభమైన మార్గం అనిపిస్తుంది. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎసిడిటీకి దారితీయవచ్చు.ఖచ్చితంగా ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇంకా అలాగే కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యకు కూడా ఇది కారణమవుతుంది.పచ్చి కూరగాయలు లేదా సలాడ్‌ను ఖాళీ కడుపుతో తినడం అస్సలు ఉత్తమం కాదు. అవి ముతక ఫైబర్ నిండి ఉంటాయి, ఇవి ఖాళీ కడుపుతో తినడం వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి.పండ్లను సరైన సమయంలో తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే సిట్రస్ పండ్లను మాత్రం ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా, పండ్లలో ఎక్కువ ఫైబర్, ఫ్రక్టోజ్ అధిక మోతాదులో ఉంటాయి.. వాటిని ఖాళీ కడుపుతో తింటే మీ జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది.
అలాగే పీచు ఎక్కువగా ఉన్న జామ, నారింజ వంటి పండ్లను ఉదయాన్నే తినొద్దు.ఖాళీ కడుపుతో చల్లటి పానీయాలు తాగడం వల్ల మీ శ్లేష్మ పొర దెబ్బతింటుంది. అలాగే రోజంతా మీ జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అందుకే ఉదయాన్నే శీతల పానీయాలను తీసుకోకూడదని డాక్టర్లు చెబుతున్నారు.పరగడుపున ఒక గ్లాసు పండ్ల రసం తాగడం ఆరోగ్యకరమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే డాక్టర్లు మాత్రం ఖాళీ కడుపుతో జ్యూస్‌లు తాగొద్దని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగితే.. అందులో ఉండే చక్కెర స్థాయిలు మీ కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.ఖాళీ కడుపుతో మసాలాలు ఎక్కువ ఉండే ఆహారం, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు. అలా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో తిమ్మిర్లు, అజీర్తి వంటివి వస్తాయి.కాబట్టి ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.