బ్లడ్ క్యాన్సర్: పిల్లల్లో ఎక్కువవుతున్న కేసులు.. లక్షణాలివే?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో పిల్లల్లో చాలా ఎక్కువగా లుకేమియా(బ్లడ్ క్యాన్సర్) కేసులు బాగా బయటపడుతున్నాయి. ల్యుకేమియా అనేది ఎముక మజ్జతో సహా శరీరంలోని రక్తం-ఏర్పడే కణజాలాల క్యాన్సర్. ఈ వ్యాధి సోకినవారికి, ఎముక మజ్జలో తెల్ల రక్త కణాలు వేగంగా, అసాధారణంగా పెరుగుతాయి. ఈ క్యాన్సర్‌ను చికిత్సతో నయం చేయవచ్చునని.. ఫస్ట్ స్టేజిలోనే దీన్ని గుర్తిస్తే.. రోగికి లైఫ్ రిస్క్ ఉందని డాక్టర్లు అంటున్నారు.రక్త కణాల మార్పిడి ద్వారా ఈ క్యాన్సర్‌ను సులభంగా నయం చేయవచ్చునన్నారు. కీమోథెరపీతో పాటు, రక్త కణాల మార్పిడి ఈ క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స అని క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ అనురాగ్ కుమార్ పేర్కోన్నారు. ఈ ప్రక్రియ తలసేమియా రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎముక మజ్జ మార్పిడిని ఏ వయస్సులోనైనా చేయవచ్చునని తెలిపారు. అధునాతన సాంకేతికతతో, ఎముక మజ్జ మార్పిడి(బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) ప్రక్రియ 70-80 సంవత్సరాల వయస్సు గల రోగులలో కూడా సులభంగా చేయవచ్చు.



ఇదిలా ఉంటే పిల్లలలో లుకేమియా రోగాన్ని నిర్ధారించే  లక్షణలు ఇవే..అవేంటో తెలుసుకోండి.ఆకస్మికంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలే.శరీరం పసుపు రంగులోకి మారడం కూడా బ్లడ్ క్యాన్సర్ సంకేతం.బ్లడ్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి.. ఎముకలలో నొప్పి. ఈ నొప్పి ఆర్థరైటిస్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకవేళ ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే, తక్షణమే డాక్టర్‌ను సంప్రదించండి.ఈ క్యాన్సర్‌ వ్యాధి బారిన పడినవారిలో తెల్ల రక్తకణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది చాలా సందర్భాలలో రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, తరచుగా దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలు తలెత్తుతాయి.శరీరంలో ఏదైనా భాగానికి గాయమైతే, ఆ గాయం చాలా రోజులు నయం కాదు. అంతేకాదు అధిక రక్తస్రావం అవుతుంది.కాబట్టి ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించిన అస్సలు ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ ని సంప్రదించండి. జాగ్రత్తగా వుండండి. పిల్లల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: