వామ్మో.. నిద్రలేమి వల్ల ఈ భయంకర జబ్బులు ఖాయం?

Purushottham Vinay
నిద్రలేమి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలంపాటు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఏ పనిపై దృష్టి పెట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సమయం, తక్కువ సమయం నిద్రపోతున్నట్లయితే రోగ నిరోధక శక్తి చాలా వేగంగా బలహీనపడుతుంది. ఇతర వ్యాధులు వ్యాపిస్తాయి. సమస్య ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.సరిపడా నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనకారులు తెలిపారు. వీటితో పాటు ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే నిర్ణీత సమయం నిద్రపోవడం ద్వారా శరీరాన్ని పిట్‌గా ఉంచుకోవచ్చునని వైద్యులు సలహా ఇస్తున్నారు.సాధారణ గంటలు నిద్రపోతున్న వారికంటే.. వీరు 20 శాతం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారని ఓ పరిశోధనలో తేలింది.


నిద్రలేమి కారణంగా వచ్చే 13 వ్యాధుల జాబితాను రూపొందించారు పరిశోధకులు. ఈ మూడు వయసుల వారిలోనూ 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మల్టిమోర్బిడిటీ ప్రమాదం 30 నుండి 40 శాతం పెరిగిందని పరిశోధకులు తేల్చారు.ఆరోగ్యవంతమైన జీవితానికి 7 గంటల నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా పనిలో నిమగ్నమైపోయినా.. ఒకటి లేదా రెండు రోజులు తక్కువ నిద్రపోయినా, మరుసటి రోజు తగినంత నిద్రపోవడం ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. కానీ, ప్రతి రోజూ ఇలాగే సరిపడా నిద్ర పోకపోతే అనేక వ్యాధులకు ఆహానం పలికినట్లే అవుతుంది. ఇటీవల ఒక అధ్యయనంలో చాలా మంది 4 నుంచి 5 గంటల పాటు మాత్రమే నిద్ర పోతున్నారని వెల్లడైంది. ఇలా తక్కువ సమయం నిద్రపోయే వారిలో ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అధ్యయనం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: