మయోసిటీస్ అంటే ఏంటో తెలుసా..?
గత కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరోయిన్ సమంత పలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన సమంత తను ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేసింది. అయితే నిన్నటి రోజున తను మయోసిటీస్ అనే వ్యాధి బారిన పడినట్లుగా తెలియజేసింది. అయితే ఈ వ్యాధి ఇమ్యూన్ కండిషన్ ని కలిగి ఉంటుంది. అయితే ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ వ్యాధి ఎలా సోకుతుందో కారణాలు తెలుసుకుందాం.
మయోసిటీస్ అనే వ్యాధి కండరాలకు వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య.దీనివల్ల కండరాల వాపుకు గురవుతాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో రోగనిరోధక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఈ వ్యాధి వల్ల ఆరోగ్యమైన కండరాలు కూడా సులువుగా దెబ్బతింటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. దీంతో వాపు నొప్పులు సంభవించి చివరకు శరీర బలహీనతకు మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.మయోసిటీస్ వ్యాధి రావడానికి ముందు అలసట, నొప్పులు వంటివి ఉత్సవాన్నమవుతాయి.అయితే ఈ లక్షణాలని ఈ వ్యాధిని గుర్తుపట్టడం చాలా కష్టం అంతేకాకుండా ఈ కారణంగా శ్వాస తీసుకోవడంలో కూడా పలు ఇబ్బందులు ఎదురవుతాయట.
మయోసిటీస్ వ్యాధి రావడానికి కారణాలు:
1). ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లోకి వస్తుందట ఇది కండరాలను ప్రభావితం చేసి చర్మంపై ఎరుపు దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. అంతేకాకుండా భుజాలు ,తుంటి తొడ కండరాలు బలహీనత గా మార్చేస్తాయి.
2).మయోసిటీస్ ఇది అంటూ వ్యాధులనుంచి కూడా వచ్చే ఇన్ఫెక్షన్ వంటిది దీని ఫలితంగా నేరుగా కండరాలు దెబ్బతింటాయి.
3).మయోసిటీస్ వల్ల కండరాలు చాలా బలహీనంగా మారడం జరుగుతుందట. ఆ తర్వాత భరించరాని నొప్పి వంటి సమస్యలు.
అయితే ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదట. కేవలం వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఫిజియోథెరపీతోపాటు వ్యాయామాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ-రుమాటిక్ మందులు కూడా ఉపయోగించవలసి ఉంటుంది.మయోసిటీస్ వ్యాధి వైరస్ వంటిదని నిపుణులు తెలియజేస్తున్నారు.