వెన్ను నొప్పి సమస్య ఈజీగా తగ్గాలంటే..?

Purushottham Vinay
వెన్ను నొప్పి సమస్య ఈజీగా తగ్గాలంటే..?


వెన్ను నొప్పి : వెన్ను నొప్పి ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నొప్పితో చాలా నరకయాతన అనుభవించాల్సి వస్తుంది.ప్రస్తుతం చాలా మంది కూడా వయసు పెరిగేకొద్దీ కనిపించే వెన్నెముక వ్యాధి ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. వీటిని పాటించడం ద్వారా చికత్స లేకుండానే వెన్ను నొప్పి సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చని చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..అధిక కొవ్వు పదార్ధాలను నివారించడం, తగినంత నీరు త్రాగడం వెన్నెముక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ కొవ్వు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవసరమైన ఖనిజాలు మీ బరువును అదుపులో ఉంచుతాయి. మీ వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. 



కాబట్టి వీలయినంత వరకు వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఖాళీ సమయాల్లో మెడ, వీపు, భుజాలకు వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.పని సంబంధిత మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మన వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిసారీ చిన్న విరామాలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మీ వెన్నునొప్పి తీవ్రమవుతుంది.ల్యాప్‌టాప్‌లలో, కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వారి వెనుక కండరాలు, వెన్నెముక, మెడపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. రాత్రిపూట మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేసేవారు మెడపైకి ఎత్తైన దిండు పెట్టుకుని పొట్టపై పడుకోవడం వల్ల వెన్నెముక దెబ్బతింటుంది. అందువల్ల మంచి భంగిమలో కూర్చోవడం ఉత్తమం.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్  పాటించండి. వెన్నెముక నొప్పి రాకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: