మీరు రోజూ బెల్ పెప్పర్ తింటున్నారా..అయితే జాగ్రత్త..!
బెల్ పెప్పర్ అంటే చూడడానికి క్యాప్సికం లాగానే ఉంటుంది. కానీ ఇది స్వీట్ గా ఉంటుంది. అందువల్ల దీనిని స్వీట్ క్యాప్సికం అని కూడా అంటారు. ఇది సలాడ్స్ లో, రైస్ ఐటమ్ లో ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో వున్న పైబర్ కంటెంట్ తొందరగా స్లిమ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కళంగా ఉంటాయి. రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది.కంటి ఆరోగ్యానికి మెరుగుపరిచే విటమిన్ ఏ కూడా అంతే శాతం ఉంటుంది. ఇది సలాడ్స్ లో తీసుకోవడం మంచిదే కానీ, రోజు తీసుకోవడం వల్ల కొంతమందికి ఇతర సమస్యలను తెచ్చిపెడుతుంది.
బెల్ పెప్పర్ యొక్క పైభాగం జీర్ణం అవ్వడానికి మిగతా కూరగాయలతో పోలిస్తే ఎక్కువ సమయం తీసుకుంటుంది . దీనితో జీర్ణ సమస్యలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాటిలో ముఖ్యంగా గ్యాస్ లాంటి సమస్యలని బెల్ పెప్పర్స్ కలిగిస్తాయి. అలాగే అది సరిగా అరగకపోవడం వల్ల కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే నేను పచ్చి బెల్ పెప్పర్స్కి బదులు కొద్దిగా వాటిని ఉడికించి చాలా కొద్దిగా వాడుతూ ఉండాలి.వీటిని ఎక్కువగా వాడడం వల్ల వికారం కూడా కలుగుతుంది. వాంతులు, వీరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో వున్న కొన్ని రకాల రసయనాల వల్ల చర్మంపై దద్దుర్లు వంటి అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.కాబట్టి ఏదైనా సరే లిమిట్‌గా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా పచ్చివి వాడడం వల్ల మలబద్ధక సమస్యలు చుట్టూ ముడతాయి.