తంగేడుపువ్వు: బోలెడు ప్రయోజనాలు?

Purushottham Vinay
తంగేడు పువ్వులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగివున్నాయి. ఈ తంగేడుపువ్వు ఎక్కువగా కొండ ప్రాంతలలో ఉంటుంది. అలాంటి తంగేడు పూలు, ఆకులు, బెరడు వీటి అన్నింటిలో కూడా ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ తంగేడు మొక్క ను ఏవిధంగా ఉపయోగించాలి.పాదాల పగుళ్ల నొప్పి తో బాగా బాధ పడుతున్నప్పుడు లేత ఆకులను మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాయడం వల్ల నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి.దగ్గుతో చాలా ఎక్కువ బాధపడుతున్నప్పుడు తంగేడు చెట్టు లేత ఆకులను బాగా నమిలి మింగడం వల్ల దగ్గు నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. తంగేడు చిగుళ్లను బాగా దంచి తేలు కుట్టిన చోట పెట్టడం వల్ల విషం విరిగి మంట ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే అతి మూత్రం సమస్యలతో బాధపడుతున్న వాళ్లు తంగేడు విత్తనాలను పొడిచేసి ఆ పొడి 3 గ్రాములు తీసుకుని అందులోకి తేనె కలిపి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా సమస్య తగ్గుతుంది.తంగేడు పువ్వుల పొడిని ముల్తానీ మట్టితో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.


తంగేడు ఆకులు ఇంకా మెంతులు కలిపి మజ్జిగలో మెత్తగా నూరి మీ తలపై ఉంచి ఆముదం ఆకుతో ఆ మిశ్రమాన్ని కప్పి ఉంచి గంట తరువాత స్నానం చేయాలి.. ఇలా చేస్తే శరీరం చల్లబడుతుంది.తలనొప్పి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తంగేడు లేత చిగుళ్లను మాడు మీద పెట్టి బట్టతో కట్టడంవల్ల తలనొప్పి నుంచి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా కంటి రోగాలను కూడా నివారిస్తుంది.ఈ తంగేడు పువ్వు రేకుల కషాయాన్ని తాగితే మధుమేహం రాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తంగేడు పువ్వుల రేకులు, నల్ల వక్కల పొడి ఓ స్పూన్ ఇంకా రెండు గ్లాసుల మంచి నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగడం ద్వారా చక్కెర స్థాయిలు అనేవి తగ్గుతాయని సూచిస్తున్నారు.మలబద్దక సమస్యతో బాధపడుతున్న వాళ్లు తంగేడి ఆకులను నీడలో ఎండబెట్టి బాగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటితో తాగడం వల్ల మలబద్దక సమస్య ఈజీగా తగ్గుతుంది.తంగేడు చెట్టు వేరుతో కాషాయం చేసుకొని తాగడం వల్ల నీళ్ల విరోచనాలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా తంగేడు బెరడును నమిలి రసం మింగినా కూడా విరేచనాలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: