పాలల్లో ఇది కలిపి తాగితే కంటి సమస్యలు మాయం?

Purushottham Vinay
నానబెట్టిన బాదం పప్పును, మిరియాలను, పటిక బెల్లాన్ని ఇంకా అలాగే ఒక గ్లాస్ పాలను తీసుకోండి. ఇక ముందుగా నాలుగు నానబెట్టిన బాదంపప్పులను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. ఆ తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.ఇక ఇందులో 4 మిరియాలను ఇంకా అలాగే ఒక టీ స్పూన్ పటిక బెల్లాన్ని వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చగా తీసుకోవాలి. ఇలా పాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మనం మన కంటి చూపును చాలా ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు. పిల్లలకు ఈ పాలను ప్రతిరోజూ ఇవ్వడం వల్ల వారిలో కూడా కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఈ పాలను తాగడంతో పాటు మునగాకును కూడా మీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. మునగాకుల్లో కూడా విటమిన్ ఎ ఇంకా అలాగే క్యాల్షియం వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.


మునగాకును తీసుకోవడం వల్ల ఎముకలు కూడా చాలా ధృడంగా అవ్వడంతో పాటు కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.ప్రతి రోజూ కూడా ఒక టీ స్పూన్ మునగాకు రసానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు అసలు రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల కూడా కంటి చూపును చాలా బాగా మెరుగుపరుచుకోవచ్చు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల కళ్ల మంటలు ఇంకా అలాగే కళ్లల్లో దురదలు వంటి ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.ఇంకా అలాగే పోషకాలు కలిగిన ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా అలాగే కంటికి సంబంధించిన వ్యాయామాలు కూడా చేస్తూ ఖచ్చితంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడడంతో పాటు ఇతర కంటి సంబంధిత సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన చిట్కాలు పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: