చాలా మందిని మొటిమలు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు బాగా పీడిస్తూ ఉంటాయి. ఇలాంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి సహజమైన టిప్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కానుగ చెట్టు ఆకులను, జిల్లేడు ఆకులను ఇంకా అలాగే జాజి చెట్టు ఆకులను సమానంగా తీసుకుని వాటిని గోమూత్రంతో కలిపి బాగా మెత్తగా నూరాలి. ఇక ఈ మిశ్రమాన్ని చర్మంపై సమస్య ఉన్న చోట రాయడం వల్ల అన్ని చర్మ రోగాలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు 3 గ్రాముల కానుగ గింజల పప్పును ఇంకా 50 గ్రాములు ఆవు పాలల్లో కలిపి తాగుతూ ఉంటే మూత్రపిండాల సమస్యలతో పాటు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. కానుగ గింజల పప్పును 10 గ్రాముల మోతాదులో తీసుకుని వాటికి 10 గ్రాముల పిప్పిళ్లను ఇంకా అలాగే 5 గ్రాముల తుమ్మ జిగురును కలిపి బాగా మెత్తగా నూరాలి. తరువాత వీటిని శనగ గింజలంత సైజులో మాత్రలుగా చేసుకుని గాలికి బాగా ఆరబెట్టాలి.
ఇలా తయారు చేసుకున్న మాత్రలను జ్వరం వచ్చిన వారు మూడు పూటలా పూటకు ఒక మాత్ర చొప్పున గోరు వెచ్చని నీటితో తీసుకుంటే చాలా ఈజీగా తగ్గుతుంది.కానుగ గింజల పప్పును పొడిగా నిల్వ చేసుకోని పిల్లలు కోరింత దగ్గుతో బాగా బాధపడుతున్నప్పుడు ఈ పొడిని ఒక గ్రాము తేనెతో కలిపి ఇవ్వడం వల్ల దగ్గు ఈజీగా తగ్గతుంది. ఇంకా అలాగే పురుషుల్లో వచ్చే వృషణాల వాపు సమస్యను తగ్గించడంలో కూడా కానుగ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. కానుగ గింజల పప్పును, ఆముదం గింజల పప్పును ఇంకా అలాగే గిజ్జ కాయల పప్పును సమానంగా తీసుకుని వంట ఆముదంతో కలిపి మెత్తగా నూరి ఇక ఈ మిశ్రమాన్ని వృషణాల పై రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రపరుచుకోవడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. పిల్లల్లో వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో కానుగ కాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కాయలను ఒక నల్ల దారానికి ఒక దండలాగా గుచ్చి పిల్లల మెడలో వేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.