ఛాతీ నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు?

Purushottham Vinay
ఎక్కువగా ఛాతీ నొప్పి రావడం అనేది ఖచ్చితంగా చాలా ఆందోళన కలిగించే విషయం. చాలా సార్లు ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా వేధిస్తుంటుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ముందుగానే ఉపశమనం పొందడం చాలా అవసరం.తేలికపాటి ఛాతీ నొప్పిని కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించడం ద్వారా ఈజీగా ఉపశమనం పొందవచ్చు. కానీ ఛాతీ నొప్పి కనుక తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే, ఛాతి నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్లు ముందుగా కొన్ని ఇంటి చిట్కాలతో నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం పొందొచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం..అన్నం తిన్న తర్వాత ఛాతీ నొప్పి వస్తే ఖచ్చితంగా బాదం పప్పును రోజూ తినాలి. లేదా బాదం పాలని తాగండి. ఇలా చేయడం వల్ల ఛాతీ నొప్పి నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఇంకా అంతే కాకుండా నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కూడా సమస్య అనేది చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది.


ఇంకా అలాగే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వచ్చే ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ని కూడా ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని దానిని ఒక గ్లాసు నీటిలో కలపండి.దాన్ని మీరు భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలి.ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే గ్యాస్ కారణంగా కూడా ఛాతీ నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇక ఆ సందర్భాల్లో వేడి పానీయాలు తాగడం వల్ల గ్యాస్ సమస్య ఈజీగా తగ్గుతుంది. దీంతో ఛాతీ నొప్పి నుంచి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే పసుపులో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఛాతీ నొప్పి నుంచి ఈజీగా మీకు ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు వేడి పాలలో ఒక చెంచా పసుపు కలుపుకుని మీరు తాగవచ్చు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఛాతి నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: