ఎలాంటి భోజనా సూత్రాలు పాటిస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందో తెలుసా..?

Divya
సాధారణంగా కూటి కొరకే కోటి విద్యలు అంటారు. మనం ఏ పని చేసినా అది మనకు పొట్టకూటి కోసమే. భోజనం చేయడానికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. కొన్ని నియమాలు, భోజనా సూత్రాలు పాటిస్తూ భోజనం చేస్తేనే జీర్ణ వ్యవస్థ తన పని తాను సక్రమంగా తను చేస్తుంది.అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆకలి వేసినప్పుడే తినాలి..
1. ఆకలి వేసినప్పుడే తినాలి.మన పొట్టలో జీర్ణ రసాయనాలు అప్పుడు మాత్రమే విడుదల అవుతాయి కాబట్టి ఆ సమయంలో భోజనం చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.లేదంటే జీర్ణవ్యవస్థకు సమస్యలు ఎక్కువ వస్తాయి.
2. ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రదేశంలో తినాలి
ఇప్పుడున్న బిజీలైఫ్ లో తొందరతొందరగా ఎక్కడపడితే అక్కడ నిలబడి తింటూ, పని కోసం పరుగులు పెడుతుంటారు. కానీ ప్రశాంతంగా కూర్చుని ఒక 15 నిముషాల నుండి అరగంట వరకు భోజనానికి కేటాయించాలి. పరధ్యానంగా.. అంటే టీవీ,ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి చూస్తూనో, పుస్తకాలు చదువుతునో భోజనం అస్సలు చేయకూడదు. అలా చేస్తే ఏమీ తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా తెలియకుండా ఎక్కువగా తీసుకునే అవకాశం వుంది.
అది మన శరీరానికి అంత మంచిది కాదు.
3.వేడివేడి భోజనం చేయాలి..
ఆహారం ఎప్పుడైనా వండిన తర్వాత వేడివేడిగా, తాజాగా ఉన్నప్పుడే తినాలి. అలా వేడివేడిగా తినడంవల్ల జీర్ణాశయంలో ఎంజైమ్‌లు సక్రమంగా పనిచేస్తాయి.
4.మంచి ఆహారాన్ని తీసుకోవాలి..
మనకి ఉన్నంతలో సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. అప్పుడే శరీర ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది

5.ఆస్వాదిస్తూ తినాలి
భోజనం చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ ఐదు ఇంద్రియాలను ఉపయోగించాలి. అంటే ఆహారం వాసన పీల్చుకోవడం, తింటున్న ప్లేట్ రూపాన్ని చూడటం, విభిన్న రుచులను చూడటం, ఇలా తృప్తిగా భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.మరియు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి. లేకుంటే గ్యాస్ సంబంధిత సమస్యలు చుట్టుముట్టే అవకాశం వుంది. ఇలాంటి సూత్రాలు పాటిస్తూ సరిగ్గా భోజనం చేయడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: