ఖర్జూరం యొక్క ప్రయోజనాలు ఏంటంటే..?
గుండె సమస్యలను నివారిస్తుంది:
ఖర్జూరాన్ని రోజు తినడం వలన గుండె కొట్టుకునే రేటు.. రక్తపోటును అదుపులో ఉంచి, గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది.నీరసం ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది.
తక్షణ శక్తిని ఇస్తుంది :
అత్యంత తియ్యగా ఉండే ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్ అధికంగా ఉన్నాయి.ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి,తక్షణమే శక్తిని అందిస్తాయి. పాలతో కలిపి తీసుకుంటే ఖర్జూరం చక్కని ఫలితాన్ని ఇస్తుంది.
కంటికి చాలా మంచిది :
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్ సి కంటికి చాలా మంచిది. దీనిని రోజు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
బరువు పెరగడానికి:
ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరం తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. మరియు ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్ లో ఖర్జూరాన్ని చేర్చుకోవడం ఎంతో మంచిది.
మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది :
మిత్ర పిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కలిగించే శక్తి ఖర్జూరానికి ఉంది. అంతే కాకుండా మూత్ర సంబంధించిన సమస్యలను మరియు ఇన్ఫెక్షన్స్ ని కూడా దూరం చేస్తుంది.
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది :
ఖర్జూరంలో ఉండే ఫైబర్ మన మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.రాత్రిపూట నీటిలో నాలుగైదు ఖర్జూరాలను నానబెట్టండి. ఉదయాన్నే ఖర్జురాలను బాగా పిండి ఆ నీటిని తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది.