కొబ్బరి పువ్వులో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదిలిపెట్టరు?

praveen
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే.. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఎంతోమంది ముందుగా పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ అనేది అటు దేవుడికి ప్రీతికరమైనది అని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇలా కొబ్బరికాయ కొట్టడాన్ని ఒక ఆచారంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా కొబ్బరికాయ కొట్టిన సమయంలో అందులో ఒక పువ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇలా పువ్వు కనిపించింది అంటే చాలు తమకు మంచి జరుగుతుందని దేవుడి ఆశీస్సులు లభించాయని కొంతమంది ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు.


 ఇంకొంతమంది అలా పువ్వు కనిపించడాన్ని చెడుకు సంకేతం గా భావిస్తూ ఇక కొబ్బరికాయలో నుంచి ఆ పువ్వుని తీసి పడేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఇలా కొబ్బరికాయలో వచ్చిన పువ్వును తినొచ్చా లేదా అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక కొబ్బరికాయలో వచ్చిన పువ్వు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం మరోసారి  కొబ్బరికాయలో పువ్వు ఎవరు పడేయారు అని చెప్పాలి.


 ఇంతకీ కొబ్బరికాయలో పువ్వు ఎలా ఏర్పడుతుందంటే :

 కొబ్బరికాయలో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయి కొబ్బరి ముదిరినప్పుడు లోపల కొబ్బరి పువ్వు ఏర్పడుతుందట. కొబ్బరి నీళ్ల కంటే ఇక అందులో ఉన్న పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయట. తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.

 ఆరోగ్య ప్రయోజనాలు :

 కొబ్బరికాయలో వచ్చే పువ్వులో తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయట. అంతేకాదు ఇన్సూలీన్ శ్రావాన్ని  ప్రేరేపించడంలోనూ ఇక ఇది సహాయపడుతుందట. కొబ్బరిలో ఉండే పువ్వులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట  ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందట. అంతేకాదు కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీ డామేజ్ వంటి జబ్బులను ఇక అలసట నీరసం లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుందట. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడమే కాదు ముఖంపై ముడతలు చిన్న మచ్చలను కూడా నివారిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధిని దరిచేరకుండా కూడా ఇక కొబ్బరి పువ్వు రక్షణ కల్పిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: