అదిక బరువు సులువుగా తగ్గడానికి ఈ 5 ఆహారాలు తీసుకోవాల్సిందే..!

Divya
ఇప్పుడున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల,చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి,అధిక బరువు, ఊభాకాయం వంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. మరియు ఆ బరువును తగ్గించుకోవడానికి నానా ఆగచాట్లు పడుతున్నారు.కానీ మనకీ సులువుగా దొరికే ఈ 5 ఆహారాల వల్ల తొందరగా బరువు కోల్పోవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..
1.అల్లం..
మనం రోజువారీ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల, ఇందులోని జింజిరాల్ అనే సమ్మేళనం మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో అధికంగా సహాయ పడతాయి. దీనితో అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.
2.ఆకుకూరలు..
ఆకుకూరలలో ముఖ్యంగా తోటకూర బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ, మరియు పైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేసి, అనవసరమైన వ్యర్థలన్నింటిని శరీరం నుండి బయటకు పంపడానికి సహాయం చేస్తాయి.
3.పండ్లు..
డిన్నర్ సమయంలో పండ్లను తీసుకోవడం వల్ల, అవి తొందరగా జీర్ణం అయి అధిక బరువు పెరగకుండా, కంట్రోల్ చేస్తాయి.ముఖ్యంగా విటమిన్ సి గల ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
4.చిరుదాన్యాలు..
మన భారతీయులు ఎక్కువగా బియ్యం ఆహారంగా తీసుకుంటువుంటాము. కానీ ఇందులోని కారబోహైడ్రెట్స్ అధికంగా ఉండటం వల్ల, అవి శరీర బరువు పెంచడానికి దోహదం చేస్తాయి. కావున బియ్యం స్థానంలో రాగులు, సజ్జలు, జొన్నలు, ముడి బియ్యం,కొర్రలు, సాములు వంటి చిరు దాన్యాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందులోని పైబర్ మరియు ఇతర న్యూట్రియంట్స్ ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉండి, ఎక్కువసేపు ఆకలి వేయదు. దీనితో అధికంగా తినాలానే కోరిక కంట్రోల్ ఉండి, శరీర బరువు పెరగకుండా చేస్తాయి.
5. పప్పు దాన్యాలు..
 పప్పుధాన్యాలలో  కార్బోహైడ్రేట్స్ తక్కువగాను ప్రోటీన్ ఎక్కువగానూ ఉంటాయి.వీటిని తరుచూ మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్స్ శరీర బరువు పెరగకుండా చేసి, కండరాల దృఢంగా మారడానికి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: