కొవ్వు పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, కోడిగుడ్లు, టీ ఇంకా కాఫీ వంటి పదార్థాలను తీసుకున్నప్పుడు కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే నిద్రలేచిన తరువాత ఇంకా ఎక్కువ సమయం దాకా మాట్లాడకుండా ఉన్నప్పుడు, ఆహారాన్ని ఎక్కువ సమయం దాకా తీసుకోకుండా ఉన్నప్పుడు లాలాజలం విడుదల తగ్గి నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. అలాగే ఈ సమస్య నుండి బయటపడడానికి చుయింగ్ గమ్ లను నములుతూ ఉంటే నోటి దుర్వాసన రాదు.నోటిదుర్వాసన సమస్యతో ఎక్కువగా బాధ పడే వారు దంతాలను ఖచ్చితంగా రోజుకు రెండు పూటలా శుభ్రం చేసుకోవాలి. అలాగే వేప, చండ్ర ఇంకా అలాగే తుమ్మ వంటి చెట్టు పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ లు ఈజీగా తగ్గి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇంకా వీటితో పాటు అతి మధురం తో తయారు చేసిన క్యాండీలను ఎక్కువగా చప్పరించాలి.
వీటిని చప్పరించడం వల్ల లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. దీంతో నోటి దుర్వాసన సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అలాగే లవంగాలను చప్పరించడం వల్ల కూడా ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.అలాగే దోర జజామకాయను దంతాలతో కొరికి నమిలి తినడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే సోంపు, జీలకర్ర, ఏలక్కాయ, దాల్చిన చెక్క వంటి వాటిని వక్కపొడిలా చేసుకుని నములుతూ ఉంటే నోటి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు నోటి దుర్వాసన సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. అలాగే త్రిఫల చూర్ణానికి వంటసోడాను కలిపి కషాయంలా చేసుకోని ఆ తరువాత ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్స్ పాటించడం వల్ల మనం చాలా సులభంగా నోటి దుర్వాసన సమస్యను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.