ప్రాణాంతక "క్యాన్సర్" చిన్న చిన్న వర్క్ ఔట్స్ తో బలాదూర్ !

VAMSI
నేటి కాలంలో జనాభా ప్రాణాంతక వ్యాధులు సోకి మరణిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని జబ్బులు సోకినా విషయాన్ని గుర్తించి అందుకు తగిన చికిత్సను చేసుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. కానీ కొన్ని వ్యాధులు సోకిన విషయం తెలిసినా.. చికిత్స చేసినా ఉపయోగం లేకుండా ఉంటాయి. అటువంటి వ్యాధులలో ఒకటే క్యాన్సర్... ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం మరియు గుట్కాలు తినడం వలన ఎక్కువగా క్యాన్సర్ సోకె ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్న మాట. అంతేకాకుండా చాలా తక్కువ సమయాలలో మాత్రమే ఎవరికీ తెలియకుండానే క్యాన్సర్ సోకి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఈ వ్యాధికి చికిత్సను చేసుకోవాలంటే సామాన్యులకు వీలయ్యే విషయం కాదు. కొన్ని సార్లు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. అయితే తాజాగా కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని చిన్న చిన్న ఎక్సరసైజ్ లు చేయడం వలన క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఇది విన్న ఎవరికైనా గమ్మత్తుగా అనిపించక మానదు. ఒక వారంలో నాలుగు సార్లు 40 నిముషాల పటు ఏరోబిక్స్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వారానికి రెండు లేదా మూడు సార్లు వెయిట్ ట్రైనింగ్ చేయడం కూడా మంచిదేనని చెబుతున్నారు. ఇలా చేయడం వలన అధిక బరువు ఉన్నవాళ్లు తగ్గడంతో పాటుగా, మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక గుండెకు కూడా చాలా మంచిదని తెలిసిందే. ఒకవేళ క్యాన్సర్ పొరపాటున వారికి సోకినా పెద్దగా ఇబ్బంది పెట్టదట. ఇలా రెగ్యులర్ గా వర్క్ ఔట్స్ చేయడం వలన బ్లాడర్ క్యాన్సర్, ఎసోఫాగస్, కిడ్నీ , బ్రెస్ట్ , కోలన్ , ఉదర మరియు గర్భాశయ క్యాన్సర్ లు రాకుండా మేలు చేస్తుందట.  మరి ఇంకెందుకు ఆలస్యం రేపటి నుండి పైన చెప్పిన విధంగా చిన్న చిన్న వ్యాయామాలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: