మధుమేహంతో బాధపడేవారు ఇలాంటి ఆహారాలు తీసుకుంటున్నారా..?
టీ, కాఫీలు..
సాధారణంగా మధుమేహంతో బాధపడేవారు, షుగర్ లేకుండా కాఫీ,టీలను తాగుతుంటారు.కాఫీ,టీ లలో ఉండే కెఫెన్ కు షుగర్ లెవల్స్ ని పెంచే గుణం ఉంటుంది. కనుక వీరు తమ రోజుని గ్రీన్ టీ కానీ,బ్లాక్ టీ తో గాని ప్రారంభించడం ఉత్తమం. ఈ టీ లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ డయాబెటిక్ గుణాలు షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
ఖర్జురాలు..
షుగర్ తో ఇబ్బంది పడేవారు ఖర్జూరాలు, కిస్ మిస్, కాన్ బీర్రీస్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల, ఇందులోని కార్బొహైడ్రెట్స్, రక్తంలోని షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. కావున వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
వైట్ బ్రెడ్..
వైట్ బ్రెడ్ ని సాధారణంగా మైదా పిండితో తయారుచేస్తారు.మైదాపిండి గ్లూకోవిట్ ఎక్కువగా ఉండే ఆహారాలలో ఇది ఒక్కటి. మైదాపిండితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల, రక్తంలో చక్కెరలను అధికంగా ఉత్పత్తి చేసి మధుమేహాన్ని పెంచుతాయి. కావున ఈ వ్యాధితో బాధపడేవారు ఈ వైట్ బ్రెడ్ ను తీసుకోకపోవడం చాలా మంచిది.
మాంసాహారాలు..
మాంసాహారాలను అధికంగా తీసుకోవడం వల్ల, ఇందులోనే సంతృప్త కొవ్వులకీ గ్లూకోస్ లెవల్స్ ని పెంచే గుణం ఉంటుంది. దీంతో మధుమేహం అధికం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున మధుమేహంతో బాధపడేవారు మాంసాహారాలను తీసుకోకపోవడం ఉత్తమం.