బరువు తగ్గాలంటే ఆ సమయంలో మాత్రమే వ్యాయామం చేయాలా.?
ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల సాయంత్రం కంటే రెండు రెట్లు వేగంగా బరువు తగ్గుతారట. దీని గురించి పరిశోధన కూడా ఏం చెబుతోంది అనే విషయానికి వస్తే సాధారణంగా ప్రతి ఒక్కరికి వ్యాయామం కోసం వారికి అనుకూలమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కొంతమంది ఉదయం పూట వ్యాయామం చేస్తే.. మరికొంతమంది సాయంత్రం పూట వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. మరి కొంత మంది ఉదయం, సాయంత్రం సమయం దొరకక మధ్యాహ్నం సమయంలో వ్యాయామం చేస్తూ ఉంటారు.
అధిక బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల బరువు వేగంగా తగ్గుతారని అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపోతే ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుందని ఒక అధ్యాయంలో తేలిందట. ఎక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల ఒక వ్యక్తి సాయంత్రం కంటే వేగంగా శరీరంలో నిలువ వున్న కొవ్వును కరిగించగలుగుతారు అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.. శరీరం యొక్క మెటబాలిజంను పెంచడానికి.. వ్యాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కానీ అర్ధరాత్రి మాత్రం వ్యాయామం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు.. సూర్యకిరణాల తాకిడి కలిగేలా వ్యాయామం చేసినట్లయితే.. ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.. పైగా విటమిన్ డి కూడా శరీరానికి లభించి అంతకుమించి సౌందర్యంగా కూడా తయారవుతారు.