క్యాన్సర్ ని దూరం చేసే బెండకాయ.. ఎలా వాడాలంటే..?
బెండకాయలలో సమృద్ధిగా ఉండే ఫైబర్.. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి మలబద్ధక సమస్య , గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. బెండకాయను తరుచూ తినడం వల్ల ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు , ఆమ్లాలు, రక్తనాళాలలో, ధమనులలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ నిల్వలను కూడా తగ్గించి రక్తప్రసరణను వేగవంతం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. బెండకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక కణాల పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. ఫలితంగా పలు రకాల క్యాన్సర్ల నుండి జీవితకాలం రక్షణ పొందవచ్చు.
బెండకాయలో సమృద్ధిగా ఉండే విటమిన్ కే, పొటాషియం, ఐరన్ వంటి మూలకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడి సంఖ్యను పెంచుతాయి.. ఫలితంగా అనీమియా వంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా తరచూ బెండకాయలు తింటే సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకొని ఊబకాయ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. తక్కువ ధరలో లభించే ఈ బెండకాయలు మనకు ఏడాది పొడవునా లభ్యం అవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మన ఆహారంలో ఒక భాగం చేర్చుకుంటే అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.