బరువు తగ్గాలనుకుంటే వీటిని తప్పకుండా తినాల్సిందే..!
శరీరానికి ఇతర అనేక ప్రయోజనాలను అందించడానికి.. బరువు తగ్గడానికి చేపలు ఉత్తమమైనవి అని అధ్యయనాలు కనుగొనబడ్డాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మంచి ఆరోగ్యం కోసం ప్రతి వారం రెండు నుండి మూడు సేర్వింగ్స్ చేపలను తినాలి అని కూడా సిఫార్సులు చేస్తున్నాయి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు తినడానికి మాంసం , చేపలు , రొయ్యలు ఇలా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే చేపలలో అనేక ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ పదార్థాలు కలిగి ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చేపలు తినడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గించే ఆహారంలో చేపలను చేర్చుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.
ఇకపోతే బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో ఎలాంటి పోషకాలు చేర్చుకోవాలి అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా చేపలను తప్పకుండా వారానికి మూడుసార్లు అయినా తప్పకుండా తినాలని చెబుతున్నారు. చేపలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని లీన్ ప్రోటీన్ అని కూడా పిలుస్తారు. తక్కువ క్యాలరీలు తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి.. కాబట్టి వీటిని తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఇందులో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువ సేపు సంతృప్తి పరుస్తుంది . ఆకలిని దూరం చేయడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు చేపలలో అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే చేపలు జీవక్రియకు బూస్ట్ అందించడం ద్వారా శరీరంలో కేలరీలను తగ్గించడానికి చాలా సహాయపడతాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం చేపలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట.