మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం చాలా సులభంగా కాపాడుకోవచ్చు. మన నిత్యజీవితంలో ఏడు రకాల జ్యూస్ లను తాగడం ద్వారా రక్తంలో షుగర్ ను చాలా సులభంగా నియంత్రించుకోని షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు.టొమాటో జ్యూస్లో మధుమేహం వల్ల కలిగే మంటను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.ప్రతిరోజూ కూడా పచ్చి టమోటా తినడం లేదా దాని రసం తాగడం వల్ల రక్తపోటు సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అందువల్ల మధుమేహంతో సంబంధం ఉన్న గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇంకా అలాగే బార్లీ నీరు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరంలా పని చేస్తుంది.ఎందుకంటే ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా స్థిరీకరిస్తుంది. అలాగే ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది.ఇది చాలా వ్యాధులను కూడా ఈజీగా దూరం చేస్తుంది.ఇక కాఫీ తాగడం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని ఈజీగా తగ్గిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట ఒక కప్పు కాఫీ తాగితే యాంటి ఆక్సిడెంట్స్ అనేవి విడుదలవుతాయి. అయితే చక్కెరతో కాఫీ తాగడం వల్ల కెలోరీలు కూడా పెరుగుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి.అలాగే ఆవు పాలు కూడా డయాబెటిస్ రోగులకు చాలా రకాలుగా మంచిది. అయితే పాలను తీసుకున్న సమయంలో మీరు కొద్దిగా ఆహారాన్ని తగ్గిస్తే చాలా మంచిది.అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల హైపర్ గ్లైసీమియా వంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవచ్చు. గ్రీన్ టీ గ్లైసెమిక్ స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉండటమే కాకుండా, ఇది యాంటీఆక్సిడెంట్ ఇంకా అలాగే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మధుమేహం వల్ల కలిగే కీళ్ళు కండరాల వాపును కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది.ఇక కాకరకాయ రసం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. ఇది రక్తంలోని చక్కెరను శక్తిగా మారుతుంది.ఇంకా అలాగే ఇది ఆకలి అనుభూతిని తగ్గించి బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.