సోంపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఐరన్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి ఇంకా సెలీనియం వంటి పోషకాలు చాలానే ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తాయి.ఇక సోంపు పాలను తాగడం వల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.ఇంకా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ పాలను తాగడం వల్ల శరీరం ఎల్లప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సోంపు పాలను తాగడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఈ పాలను తాగడం వల్ల రక్తపోటు ఈజీగా అదుపులో ఉంటుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో మలినాలు, విష పదార్థాలు చాలా సులభంగా తొలగిపోతాయి. ఇంకా అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల రక్తహీనత సమస్య అనేది మన దరి చేరకుండా ఉంటుంది. శరీరంలో క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుంది.
ఎముకలు చాలా ధృడంగా, బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా ఈజీగా తగ్గుతాయి.ఈ పాలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను, రెండు టీ స్పూన్ల సోంపు గింజలను వేసి ఒక పొంగు వచ్చే దాకా వేడి చేయాలి. తరువాత ఆ పాలు బాగా మరిగి పొంగు వచ్చిన తరువాత వాటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఈ సోంపును తిని పాలను తాగాలి. అయితే ఇందులో పంచదారను మాత్రం అస్సలు కలపకూడదు. రుచి కోసం ఇందులో కొద్దిగా పటిక బెల్లం పొడిని కలుపుకోవాలి. ఈ పాలను ప్రతి రోజూ రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ పాలను తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం ఖచ్చితంగా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. అంతతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గి చక్కగా నిద్రపడుతుంది. ఈ పాలను తాగడం వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.ఇక గర్భిణీ స్త్రీలు కూడా ఈ పాలను తాగవచ్చు.