డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో చక్కెరలు, అలాగే కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని మనం కేవలం 20 గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని నేరుగా కూడా అస్సలు తీసుకోకూడదు.ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే తినాలి. ఇలా తినడం వల్ల వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా బాగా అందుతాయి.ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ను ఎంత మోతాదులో తీసుకోవాలో  తెలుసుకుందాం. ఇక మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు ఒకటి. ఇది మన ఆరోగ్యాన్ని ఇంకా అందాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.ప్రతి రోజూ 4 నుండి 7 బాదంపప్పులను నానబెట్టి వాటిపై ఉండే పొట్టును తీసి తినాలి.ఇంకా అలాగే వాల్ నట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి.ప్రతి రోజూ 3 నుండి 4 వాల్ నట్స్ ను నానబెట్టి తీసుకోవాలి. ఇంకా అదే విధంగా మనం ఖర్జూరాలను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.


మధ్యస్థంగా ఉండే 2 ఖర్జూరాలను ప్రతి రోజూ కూడా ఆహారంగా తీసుకోవాలి. ఇంకా అలాగే మన శరీరానికి కావల్సిన పోషకాలను, బలాన్ని ఇంకా ప్రోటీన్లను అందించే వాటిల్లో పిస్తా పప్పుని రోజుకు 20 గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇంకా అలాగే మనం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. జీడిపప్పు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. మనం వారానికి 28 జీడిపప్పుల దాకా తీసుకోవచ్చు.అలాగే వీటితో పాటు మనం ఎండుద్రాక్షను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం.వీటిని మనం రోజుకు గుప్పెడు మోతాదులో తినవచ్చు.అలాగే మన శరీరానికి కావల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించే ఆహారాల్లో అవిసె గింజలు కూడా ఒకటి. అవిసె గింజలను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. వీటిని ప్రతి రోజూ రాత్రి ఒక టీ స్పూన్ మోతాదులో పొడిగా చేసుకుని తినాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మన శరీరానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. ఇంకా అలాగే మనం తినే డ్రై ఫ్రూట్స్ లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల కూడా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: