ఈ నీళ్లు తాగితే ఏ రోగాలు రావు?

Purushottham Vinay
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం చల్లబడినప్పటికి వీటిని తాగడం వల్ల మనం ఖచ్చితంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేసవికాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేసవికాలంలో శరీరానికి హానిని కలిగించకుండా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరాన్ని చల్లబరిచే పదార్థాల్లో బార్లీ నీళ్లు కూడా ఒకటి.బార్లీ గింజలని ఎక్కువగా వీటితో కిచిడీ, సలాడ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొందరు వీటిని పిండిగాచేసి చపాతీ పిండిలో కలుపుకుని చపాతీలు కూడా తయారు చేసుకొని తింటారు.ఇంకా అంతే కాకుండా బార్లీ గింజలతో మనం బార్లీ నీటిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బార్లీ నీళ్లు తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.అలాగే ఈ నీటిని తాగడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ బార్లీ నీటిని ఎలా తయారు చేసుకోవాలి…అలాగే ఈ నీటిని తాగడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఏమిటి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నీటిని తయారు చేసుకోవడానికి  ముందు ఒక గిన్నెలో ఒకటిన్నర లీటర్ల నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ నీళ్లు వేడయ్యాక అందులో ఒక కప్పు బార్లీ గింజలను వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని చల్లారనివ్వాలి.


ఇక నీళ్లు చల్లారిన తరువాత వాటిని వడకట్టుకుని అందులో రుచి కొరకు తేనె ఇంకా నిమ్మరసం లేదా ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నీటిని సాధారణ నీటిలా రోజంతా కూడా తాగవచ్చు.ఇంకా ఈ నీటిని తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బార్లీ గింజల్లో ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం ఇంకా ఫైబర్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది. ఎండకాలంలో ఈ నీటిని తాగడం వల్ల మనం మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు కూడా ఈజీగా తగ్గుతాయి.మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: