హైపోథైరాయిడ్ ఉన్నవారు మిల్లెట్స్ తింటే అంతే సంగతులు..!

Divya
పూర్వం మన దేశంలో ఎక్కువగా మిల్లెట్స్ మాత్రమే పండించి,అవి మాత్రమే తినేవారు.కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఎప్పుడో కానీ తినేవారు కాదు.దానితో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటివి కాదు.మరియు వారి ఆయుర్దాయం కూడా ఎక్కువగా ఉండేది.ఈ అవగాహనతో ఇప్పుడున్న ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగి,కార్బోహైడ్రెట్స్ అధికంగా వున్న రైస్ బదులుగా,పోషకాలు ఎక్కువగా లభించే మిల్లెట్స్ నీ అధికంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. వీటివల్ల అధిక బరువు కంట్రోల్ ఉండటమే కాక,ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి.మిల్లెట్స్ తినడం ప్రారంభించాలి అనుకునే వారు తొందరగా జీర్ణం అయే మిల్లెట్స్ తో ప్రారంభించడం ఉత్తమం. వీటిని జావా, లేదా రొట్టెలు తయారు చేసుకొని తినడం మంచిది.కానీ అన్ని రకాల మిల్లెట్స్ అందరికి ఉపయోగపడవు.ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారికి మిల్లెట్స్ తినడం వల్ల, వారి సమస్య మరింత పెరుగుతుంది.ఇవి థైరాయిడ్ వున్నవారు తింటే కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మిల్లెట్స్ అధికంగా తీసుకోవడంతో థైరాయిడ్ మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది.మిల్లెట్ తీసుకున్నప్పుడు, వారి థైరాయిడ్ గ్రంధి పనితీరులో మార్పు కలుగుతుంది.చిరు దాన్యాలలో ఎక్కువగా వున్న గోయిట్రోజెన్‌లు మనం తిన్న ఆహారం నుండి అయోడిన్ శోషణకు అవరోధం కలిగిస్తుంది.కావున థైరాయిడ్ సమస్య కలవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
మిల్లెట్స్ తినాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చిరుదాన్యాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా నీటిని తీసుకోవాలి.వీటిని తినేటప్పుడు బాగా వుండికించుకోవాలి.మరియు అన్ని ఆనారోగ్య సమస్యలు కలవారికి ఒకే రకమైన మిల్లెట్లు తీసుకోకూడదు.వీటిని తీసుకోవడానికి ఉదయం, మధ్యాహ్నం మంచి సమయము అని చెప్పవచ్చు. మరియు కొన్ని రకాల మిల్లెట్స్ కొన్ని సీజన్లలో మాత్రమే తీసుకోవాలి.ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేసే జొన్నలు,రాగులు,ఉదలు,సాములు వంటి తగిన మొతాదులో తీసుకోవాలి.వీటితో తయారుచేసిన జావలు తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.మరియు చలికాలంలో గోధుమలు,బియ్యం అరికలు,ఊదలు,సజ్జలు,బాజ్ర మొదలైనవి తీసుకోవాలి. ఇవి శరీరానికి తగిన వేడిని అందించి, చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను తొలగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: