మనలో చాలా మంది కూడా భోజనం చేసిన తరువాత ఎక్కువగా సోంపును తింటుంటారు. దీన్ని తినడం వల్ల ఆహారం చాలా సులభంగా జీర్ణం అవుతుంది.దీన్ని తినడం వల్ల అజీర్తి సమస్య రాదు. అలాగే గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట ఇంకా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే సోంపు గింజలను పొడి చేసి పెట్టుకుని దాన్ని కూడా తీసుకోవచ్చు. దీని వల్ల కూడా మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజలతో పోలిస్తే వాటి పొడితోనే మనం చాలా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ సోంపు గింజల పొడితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సోంపు గింజల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. దీంతో రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. జ్వరం వచ్చిన వారు కూడా చాలా త్వరగా కోలుకుంటారు. అలాగే ఈ పొడిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు ఇంకా వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ సోంపు గింజల పొడిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని భోజనం తరువాత తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.దీంతో డయాబెటిస్ సమస్య పూర్తిగా అదుపులో ఉంటుంది.అలాగే ఈ పొడిలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ కణాలు అంతగా వృద్ధి చెందవు. క్యాన్సర్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
ఈ పొడిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఏ రోగాలు రావు. అలాగే అనాల్జెసిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇది నొప్పులకు చాలా మేలు చేస్తుంది. ఈ పొడిలో చాలా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి.సోంపు గింజల పొడిని రోజుకు రెండు సార్లు తింటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలను ఈజీగా తగ్గిస్తుంది. లివర్ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజూ ఈ పొడిని తింటే చాలా మేలు జరుగుతుంది.లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్ బాగా శుభ్రంగా మారుతుంది. కామెర్లు ఉన్నవారికి ఈ పొడి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తింటే కామెర్లు త్వరగా తగ్గుతాయి.ఈ పొడిని తినడం వల్ల డిప్రెషన్, ఇతర మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. అందువల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండి చక్కగా నిద్ర కూడా పడుతుంది. దీంతో నిద్రలేమి నుంచి ఈజీగా బయట పడవచ్చు.