మనం రెగ్యులర్ గా టీని తాగుతూ ఉంటాం. అయితే టీ ని తాగి టీ పౌడర్ ను మాత్రం పడేస్తూ ఉంటాం. కానీ టీ ని వడకట్టగా వచ్చిన టీ పౌడర్ ను మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. టీ పౌడర్ ఉపయోగాలు తెలిస్తే మరోసారి మరెప్పుడు ఈ టీ పౌడర్ ను పడేయరు. వాడిన టీ పౌడర్ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పూరీలల్లోకి ఛోలే మసాలా కూరను తయారు చేసుకుని తింటూ ఉంటాం.ఈ ఛోలే మసాలా కూర బాగా రుచిగా రావాలంటే మనం టీ పౌడర్ ను వాడాలి. టీ తయారు చేయగా వచ్చిన టీ పౌడర్ ను బాగా కడిగి ఆ తరువాత ఈ పౌడర్ ను నీటిలో మరోసారి బాగా ఉడికించి వడకట్టాలి. వడకట్టగా వచ్చిన నీటిని ఈ ఛోలే మసాలా కూరలో వేస్తే కూర ఎంతో రుచిగా వస్తుంది. అలాగే ఈ నీటిని వాడడం వల్ల కూరకు మంచి వాసన ఇంకా రంగు కూడా వస్తుంది. అదే విధంగా ఉడికించిన టీ నీటితో ఫర్నీచర్ ను కూడా బాగా శుభ్రపరుచుకోవచ్చు.
ఈ నీటితో ఫర్నీచర్ ను కనుక శుభ్రపరిస్తే ఫర్నీచర్ కొత్తదానిలా బాగా మెరుస్తుంది. ఇంకా అంతేకాకుండా టీ పౌడర్ ను ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి కాంతి కూడా చేకూరుతుంది. అలాగే వాడేసిన టీ పౌడర్ ను మరలా నీటిలో ఉడికించాలి. ఈ నీటిని జుట్టుకు పట్టించి ఆరిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టు చాలా కాంతివంతంగా తయారవుతుంది.ఈ టిప్ ని వాడడం వల్ల కండీష్ నర్ ను వాడే అవసరం కూడా ఉండదు. ఇంకా అలాగే వాడిన టీ పౌడర్ ను మనం ఎరువుగా కూడా వాడవచ్చు. ఇక వాడిన టీ పౌడర్ ను ఆరబెట్టాలి. ఆ తరువాత దీనిని ఎరువుగా మొక్కలకు వేయాలి. ఇలా వేయడం వల్ల మొక్కలకు చాలా రకాల పోషకాలు అందుతాయి. మొక్కలు చక్కగా పెరుగుతాయి.ఈ విధంగా టీ పౌడర్ మనకు చాలా రకాలుగా సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల చాలా రకాల లాభాలను పొందవచ్చు.