గోంద్ కటిరా వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గోంధకటిరాలో కార్బోహైడ్రేట్స్ తో పాటు క్యాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉంటాయి. దీనిని వేయించి పొడిగా చేసి పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకా అలాగే దీనిని వివిధ రకాల లడ్డూలలో కూడా వేసి తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ నెయ్యిలో రెండు టీ స్పూన్ల కటిరాని వేసి వేయించాలి. కటిరా చక్కగా వేగి పొంగిన తరువాత దీనిని బాగా పొడిగా చేయాలి. తరువాత ఈ పొడిని ఒక గ్లాస్ ఆవు పాలల్లో వేసి కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఈ గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా, ఆరోగ్యంగా తయాయవుతాయి. మన కీళ్ల మధ్య గుజ్జును పెంచే గుణం కూడా ఈ కటిరాకు ఉంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో అలాగే మలబద్దకాన్ని నివారించడంలో కటిరా మనకు చాలా సహాయపడుతుంది. కటిరాను తీసుకోవడం వల్ల దగ్గు ఇంకా ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా ఈజీగా తగ్గుతుంది.
బాలింతలు ఈ గోంధ్ ను తీసుకోవడం వల్ల వారికి చాలా రకాల మేలు కలుగుతుంది. ఇది శరీరంలో ఉండే మలినాలను తొలగించి శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో కూడా గోంధ్ మనకు సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇది మన ఆరోగ్యానికే కాదు మన అందానికి కూడా చాలా మేలుని చేస్తుంది.దీనిని తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలనేవి అసలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు చాలా బలంగా తయారవుతుంది. జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. అలాగే గుండెపోటు రాకుండా ఆరికట్టడంలో కూడా గోంధ్ మనకు దోహదపడుతుంది.మన శరీరానికి శక్తిని ఇవ్వడంలో, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గోంధ్ మనకు చాలా సహాయపడుతుంది. ఈ విధంగా గోంధ్ కటిరా మర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.